పల్లీల పవర్ తెలిస్తే బాదం, పిస్తాలను కూడా పక్కన పెట్టేస్తారు

By Haritha Chappa
Mar 26, 2025

Hindustan Times
Telugu

బాదం, పిస్తా, జీడిపప్పు వంటి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటికి మించిన పోషకాలు వేరుశెనగలో ఉంటాయి. 

Canva

వేరుశెనగలో ఉండే పోషకాలు మహిళల్లో గర్భాశయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అండాశయ తిత్తులను నివారిస్తాయి. వేరుశెనగలో ఉండే ఫోలిక్ యాసిడ్ గర్భిణీ స్త్రీలకు చాలా ముఖ్యమైనదని చెబుతారు.

Canva

వేరుశెనగలో ఉండే రాగి, జింక్ శరీరంలోని కొవ్వులను జీర్ణం చేయడానికి సహాయపడతాయని చెబుతారు. ఇది ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ను పెంచుతుందని చెబుతారు.

Canva

వేరుశెనగలో ఉండే అమైనో యాసిడ్, ట్రిప్టోఫాన్ మెదడును పునరుజ్జీవింపజేసి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. సెరోటోనిన్ అనే హార్మోన్ ను ప్రేరేపిస్తుంది. 

Canva

వేరుశెనగలో పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది, ఇది వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది.  యవ్వనాన్ని కాపాడుతుంది. ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది. 

Canva

వేరుశెనగలో ఉండే రెస్వెరాట్రాల్ గుండె జీవితాన్ని బలోపేతం చేస్తుందని చెబుతారు. గుండెపోటు, గుండెజబ్బులను నివారిస్తుందని చెబుతున్నారు.

Canva

వేరుశెనగలోని పిండి పదార్ధం  కొవ్వులను భర్తీ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మధుమేహాన్ని నియంత్రిస్తుందని చెబుతారు.

Canva

పల్లీలు తినడం వల్ల మీరు త్వరగా కూడా బరువు తగ్గవచ్చు. ఇవి ఆరోగ్యకరమైన స్నాక్స్ గా చెప్పుకోవచ్చు. 

Canva

మీకు పల్లీలు తినడం వల్ల అలెర్జీ వస్తూ ఉంటే వాటిని నీటిలో నానబెట్టి తింటే ఎలాంటి అలెర్జీలు రాకుండా ఉంటాయి. 

Canva

తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ - మే తొలివారంలో మళ్లీ వర్షాలు..!

image credit to unsplash