రోజులో అతిగా కాఫీ తాగితే మీలో ఈ సమస్యలు కనిపిస్తాయి

pixabay

By Haritha Chappa
Jan 02, 2025

Hindustan Times
Telugu

 కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిదని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. ఆయుష్షు కూడా పెరుగుతుందని తేల్చాయి.

pixabay

అధికంగా కాఫీ తాగితే మాత్రం కొన్ని రకాల సమస్యలు మీ శరీరంలో మొదలైపోతాయి. అవేంటో తెలుసుకోండి.

pixabay

కాఫీ అధికంగా తాగితే మూత్రానికి ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. 

pixabay

ఛాతీలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

pixabay

కాఫీలో ఉండే కెఫీన్ జీర్ణశయంలో అధికంగా ఆమ్లాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీని వల్ల ఛాతీలో అసౌకర్యంగా అనిపిస్తుంది. 

pixabay

కెఫీన్ శరీరంలో అధికంగా చేరితే రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. హైబీపీ ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. 

pixabay

మనం తినే ఆహారంలో ఉండే కాల్షియాన్ని శరీరం గ్రహించుకుండా కెఫీన్ అడ్డుకుంటుంది. 

pixabay

కాఫీ తాగాక గంటలోనే రక్తంలో కెఫీన్ అధికంగా చేరుతుంది. ఆ తరువాత ఆరుగంటల పాటూ అలాగే కెఫీన్ స్థాయిలు ఉంటాయి.

pixabay

కాబట్టి రక్తంలో అధికంగా కెఫీన్ చేరకుండా ఉండాలంటే రోజుకు రెండు కప్పుల కన్నా ఎక్కువ కాఫీ తాగకపోవడమే మంచిది. 

pixabay

మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? అయితే ఆకలి తగ్గించే 10 తక్కువ కేలరీల ఆహారాల గురించి తెలుసుకుందాం.  

pexels