రోజుకో లవంగం నమిలితే ఈ సమస్యలు రమ్మన్నా రావు 

By Haritha Chappa
Feb 08, 2025

Hindustan Times
Telugu

లవంగాలు వంటగదిలో ముఖ్యమైన పదార్ధం.  వాటి సువాసన అద్భుతంగా ఉంటుంది. వీటిని రోజుకు ఒకటి తింటే చాలు ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

PIXABAY, DPU

ఆయుర్వేదం ప్రకారం లవంగాలు తినడం ఆరోగ్యకరమే.

PEXELS

లవంగాల్లో యూజీనాల్ ఉండటం వల్ల శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఇది శరీరంలో ఆర్థరైటిస్,  శ్వాస సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

PIXABAY

లవంగాలు తినడం వల్ల నోటిలోని హానికారక బ్యాక్టీరియా తొలగిపోయి. చిగుళ్ల వ్యాధి, పంటినొప్పి, నోటి దుర్వాసన నయమవుతుంది.

PINTEREST

లవంగం  జీర్ణ ఎంజైమ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. 

PIXABAY

లవంగాల్లో ఉండే యూజెనాల్ పంటి నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. 

PEXELS

లవంగాలు ఊపిరితిత్తులు,  వాయుమార్గాల నుండి శ్లేష్మాన్ని క్లియర్ చేస్తాయి.  దగ్గు, జలుబు,  ఉబ్బసం లక్షణాలను తగ్గిస్తాయి

PEXELS

లవంగాల్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని దెబ్బతినకుండా కాపాడి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

PINTEREST

ఆయుర్వేదం సిఫార్సు చేసిన లవంగాల్లో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు. 

PEXELS

డిస్క్లైమర్: లవంగాల గురించి ఆయుర్వేద వైద్యులు వివిధ మాధ్యమాల్లో ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ సమాచారం ఇచ్చారు. కాకపోతే దానికి హెచ్ డీ తమిళ్ తో సంబంధం లేదు. అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. 

ఐఐటీల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన టాప్ సీఈవోలు

Photo Credit: AP