రాత్రి పూట అల్పాహారం కాకుండా భోజనం చేయడం భారతదేశంలో చాలా మందికి అలవాటు. మారుతున్న జీవనశైలి కారణంగా ఈ అలవాటు చాలా మందిలో అజీర్తి, అపానవాయుకు కారణమవుతుంది. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే రాత్రి భోజనం తర్వాత వారు కొన్ని పనులు తప్పక చేయాలి.

Pixabay

By Ramya Sri Marka
Jan 18, 2025

Hindustan Times
Telugu

రాత్రి భోజనం తర్వాత తేలికపాటి నడక వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇది శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది.

Pixabay

భోజనం తర్వాత గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.వేడి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే మరింత మంచిది.

Pixabay

జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంలో జీలకర్ర, సోంపు, కొత్తిమీరలు చక్కగా ఉపయోగపడతాయి. అజీర్తి సమస్య రాకుండా ఉండాలంటే రాత్రి భోజనం చేసిన తర్వాత వీటిలో ఏదో ఒక దాన్ని నమలండి.

Pixabay

అజీర్తి, గ్యాస్ వంటి సమస్యల నుంచి తప్పించుకోవాలంటే రాత్రి భోజనం తర్వాత వేడి నీటిలో వాము వేసుకుని తాగాలి.

Pixabay

రాత్రి భోజనం తర్వాత పుదీనా, అల్లం, తులసి వంటి వాటితో తయారు చేసిన హెర్బల్ టీ తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

Pixabay

పైనాపిల్, బొప్పాయి వంటివి పాపైన్, బ్రోమోలైన్ వంటి జీర్ణ ఎంజైములను కలిగి ఉంటాయి. ఇవి ఆహారం వేగంగా జీర్ణం అవడంలో సహాయడతాయి. రాత్రి భోజనం తర్వాత వీటిని తినచ్చు.

Pixabay

ఒత్తిడి కారణంగా శరీరంలో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది జీర్ణక్రియపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. జీర్ణ సమస్యలు పెరుగుతాయి. మీరు రాత్రి పూట భోజనం చేసే అలవాటు ఉన్నవారైతే ఒత్తిడికి దూరంగా ఉండండి.

Pixabay

తిన్న తర్వాత వ్యాయామం చేయడం కడుపు నొప్పి, జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. కనుక రాత్రి పూట భోజనం చేసినవారు రాత్రి వ్యామామం చేయకపోవడమే మంచిది.

Pixabay

పిల్లలు ఫోన్ వాడకాన్ని తగ్గించే చిట్కాలు.. హార్వర్డ్ పరిశోధన ఏం చెబుతోంది?

Photo Credit: Pexels