పెరుగుతున్న వయస్సులో పిల్లల శరీరానికి అవసరమైన పోషకాలు లభించాలి. సరైన మొత్తంలో విటమిన్లు లభించినప్పుడు మాత్రమే వారు ఆరోగ్యంగా ఉండగలరు.
Image Credit : Unsplash
By Anand Sai Jul 24, 2025
Hindustan Times Telugu
పిల్లలకు విటమిన్ లోపం ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని అశ్రద్ధ చేయకూడదు.
Image Credit : Unsplash
విటమిన్ సి లోపం ఉన్న పిల్లలకు సీజన్‌తో సంబంధం లేకుండా జలుబు వస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అది తక్కువగా ఉంటే ఇన్ఫెక్షన్లు, జ్వరాలతో బాధపడుతారు.
Image Credit : Unsplash
జింక్ మరియు ఐరన్ లోపం ఉన్న పిల్లలలో తమకు నచ్చిన ఆహారాన్ని తప్ప మరే ఇతర ఆహారాన్ని ముట్టుకోరు. అందుకే వారికి తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Image Credit : Unsplash
విటమిన్ లోపం, ఎత్తు మధ్య సంబంధం ఉంది. జింక్ లేదా విటమిన్ డి లోపం ఉన్నప్పుడు, పిల్లలు ఎత్తు పెరగరు.
Image Credit : Unsplash
పిల్లల్లో జుట్టు రాలడం జింక్ లేదా బయోటిన్ లోపానికి సంకేతం. ఈ సమస్యను తగ్గించడానికి పిల్లల ఆహారంలో గుడ్లతోపాటుగా డ్రైఫ్రూట్స్ చేర్చాలి.
Image Credit : Unsplash
పిల్లల పెదవులు పొడిగా కనిపిస్తే, అది పిల్లలలో ఐరన్ లోపం ఉందని సూచిస్తుంది. దంతాలతో తరచుగా సమస్యలు ఉంటే, అది తక్కువ కాల్షియం లేదా విటమిన్ డి ని సూచిస్తుంది.
Image Credit : Unsplash
పిల్లల్లో తరచుగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అలా అయితే, అది ఖచ్చితంగా వారిలో విటమిన్లు B6 లేదా B12 లోపాన్ని సూచిస్తుంది.