ఈ మూడు రాశుల వారు జీవితంలోకి వస్తే అదృష్టమే! వీళ్ల ప్రేమకు అవధులు ఉండవు!

By Ramya Sri Marka
May 09, 2025

Hindustan Times
Telugu

మనం ప్రేమించే వ్యక్తి కన్నా మనల్ని ప్రేమించే వ్యక్తి జీవితంలోకి వస్తే అదృష్టమని చాలా మంది అంటుంటారు. అలాంటి వారే ఈ మూడు రాశుల వారు. వీళ్లు జీవితంలోకి వచ్చారంటే అంతా అదృష్టమే. వీళ్లు ఎదుటివ్యక్తిని చాలా ప్రేమిస్తారు. 

కొన్ని రాశుల వారు జీవితంలోకి వస్తే, వారి జీవితం ఎంతో ప్రేమమయంగా, ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని  జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

జీవిత భాగస్వామికి అమితంగా ప్రేమించి, అపురూపంగా చూసుకునే ఆ మూడు రాశులు ఏవో తెలుసుకుందాం రండి.

మకరం: మకర రాశి వారు తమ జీవిత భాగస్వామిని ఎంతగానో ప్రేమిస్తారు. ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తారు

సింహం: ఈ రాశి వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీపరులు. ఒక సంబంధంలోకి అడుగుపెట్టాక దాన్ని పూర్తి అంకితభావంతో కొనసాగిస్తారు. జీవిత భాగస్వామి మాటలకు ఎంతో విలువిస్తారు.

వృషభం: ఈ రాశి వారిని వివాహం చేసుకుంటే వారు అద్భుతమైన జీవిత భాగస్వామిగా ఉంటారు. చాలా రొమాంటిక్ స్వభావం కలిగినవారు. ఎంతో ప్రేమను  చూపుతారు.

గమనిక: ఈ సమాచారం శాస్త్రాలు, విశ్వాసాలతో పాటు సాధారణ జ్ఞానంతో అందించినది మాత్రమే. వీటిని ఖచ్ఛితమైన ఆధారాలు ఉండవు. వీటిని పాటించడం పూర్తిగా మీ నమ్మకాలు, ఆచారాలపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయం గురించిన ఖచ్చితమైన సమాచారం కోసం సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించండి.

కేతువు సుమారు 18 నెలల పాటు కన్యారాశిలో ఉండి ఈ ఏడాది మే 18, 2025న సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు.