రోజులో ఎంత టీ తాగొచ్చో చెప్పిన ఐసీఎంఆర్

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
May 27, 2024

Hindustan Times
Telugu

చాలా మందికి టీ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. టీతోనే రోజు ప్రారంభిస్తారు. చాలాసార్లు తాగుతుంటారు. 

Photo: Pexels

అయితే, టీలో కఫీన్ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ కూడా తాగకూడదు. టీతో కొన్ని లాభాలు ఉన్నా ఎక్కువగా తాగితే సమస్యలు తలెత్తుతాయి. రోజులో ఎంత టీ తాగొచ్చో ఇండియన్ మెడికల్ ఆఫ్ కౌన్సిల్ రీసెర్చ్ (ICMR) ఇటీవల వెల్లడించింది. 

Photo: Pexels

ఐసీఎంఆర్ ఇటీవల ఆహారానికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో ఓ రోజులో ఓ వ్యక్తి ఎంత టీ తాగాలన్న విషయాన్ని కూడా వెల్లడించింది. 

Photo: Pexels

 ఓ కప్ (150ml) టీలో 30 నుంచి 65 మిల్లీగ్రాముల కెఫీన్, కప్పు కాఫీలో 80 నుంచి 120 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. ఇన్‍స్టంట్ కాఫీలో 50 నుంచి 65 మిల్లీగ్రాములు ఉంటుంది.

Photo: Pexels

ఓ వ్యక్తి రోజులో 300 మిల్లీగ్రాముల లోపు కెఫీన్‍ను తీసుకోవచ్చని ఐసీఎంఆర్ పేర్కొంది. అంతకు మించి తీసుకోవద్దని సూచించింది. అంటే, ఓ వ్యక్తి  ఓ రోజులో రెండు నుంచి మూడు కప్‍ల టీ లేదా కాఫీ తాగొచ్చు. అంతకు మించి తాగకూడదు.

Photo: Pexels

టీ లేదా కాఫీని అతిగా మోతాదుకు మించి తాగితే ఐరన్ లోపం ఏర్పడే రిస్క్ కూడా ఉంటుంది. మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. అందుకే మోతాదు మేరకే టీ, కాఫీ తాగడం మంచిది. 

Photo: Pexels

చర్మ సౌందర్యానికి కీర దోసకాయ - కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

image credit to unsplash