టీతోనే చాలా మంది రోజు ప్రారంభం అవుతుంది. కానీ వేసవిలో హాట్ టీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా అయితే మీరు ఐస్డ్ టీని ప్రయత్నించవచ్చు.  

pexels

By Bandaru Satyaprasad
Apr 07, 2024

Hindustan Times
Telugu

సాధారణ డ్రింక్స్ కంటే ఐస్డ్ టీ ఆరోగ్యకరమైనది. మీరు నార్మల్ టీని వదిలి ఈ ఆరోగ్యకరమైన ఐస్డ్ టీ కొనసాగించడానికి ఇదే సరైన టైం కావొచ్చు. ఐస్డ్ టీ వర్సెస్ హాట్ టీ ఏది మంచిది?  

pexels

ఐస్డ్ టీ... వేడి టీకి సమానమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది కూడా తేయాకుల నుంచే తయారవుతుంది.  

pexels

ఐస్డ్ టీ తాగడం వల్ల వేసవి సమయంలో హైడ్రేటెడ్ గా, చల్లగా ఉండటానికి సాయపడుతుంది. రిఫ్రెష్ పానీయాల్లో ఇది మంచి ఎంపిక.  

pexels

ఐస్డ్ టీలో నిమ్మకాయ లేదా పుదీనా వంటి సహజ రుచులను జోడించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను కాపాడుకోవచ్చు. వేసవిలో వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.   

pexels

ప్రతి రోజూ ఐస్డ్ టీ తాగడం జీవనశైలిలో భాగం చేసుకోచవచ్చు. అయితే మితమైన తీపి, ఇతర ఆరోగ్యకరమైన పదార్థాలతో చేసిన ఐస్డ్ టీని నిత్యం మితంగా తీసుకోవచ్చు.   

pexels

ఐస్డ్ టీ తయారీ- ఓ పాత్రలో చల్లని నీరు తీసుకుని కాసేపు వేడి చేయాలి. తర్వాత అందులో టీ బ్యాగ్స్ లేదా తేయాకులు నానబెట్టాలి. టీ బ్యాగ్‌లను తీసివేసి గది ఉష్ణోగ్రతకు నీటిని చల్లార్చాలి. రుచికి చక్కెర, తేనె, నిమ్మకాయ ముక్కలు వేయాలి.   

pexels

ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కావాలంటే కాసేపు ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. అందులో తగినన్ని ఐస్ క్యూబ్స్‌ వేయాలి. ఇప్పుడు ఐస్డ్ టీ సర్వ్ చేసేందుకు సిద్ధం అయినట్లే.  

pexels

చల్లటి పానీయాల కంటే వేడి టీ మీ శరీరాన్ని చల్లబరుస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది వాస్తవం.  

pexels

తలనొప్పి వచ్చినప్పుడు ఇలా చేస్తే త్వరగా తగ్గిపోతుంది

PEXELS