హగ్ డేను ప్రతి ఏటా ఫిబ్రవరి 12న సెలబ్రేట్ చేసుకుంటారు. ఇష్టమైన వాళ్లను ప్రేమతో కౌగిలించుకోవడం వల్ల 7 ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని శాస్త్రీయంగా నిరూపితమైంది
pexels
By Hari Prasad S Feb 12, 2025
Hindustan Times Telugu
కౌగిలింత వల్ల కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. అంటే ఒత్తిడి తగ్గి ఆక్సిటాసిన్ స్థాయిలు పెరిగి మూడ్ మెరుగవుతుంది. హార్ట్ రేట్, బీపీ కూడా తగ్గుతాయి
pexels
ఇష్టమైన వాళ్లను హగ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగై గుండె ఆరోగ్యం బాగుంటుంది. గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది
pexels
ఎవరినైనా హగ్ చేసుకున్నప్పుడు వాళ్లలో భావోద్వేగపరంగా ఓ కనెక్షన్ ఏర్పడుతుంది. ఇది శరీరంలో ఆక్సిటోసిన్‌ను పెంచి సంతోషంగా ఉండేలా చేస్తుంది.
pexels
కౌగిలింతతో ప్రయోజనకరమైన హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి శరీరంలో తెల్ల రక్త కణాల యాక్టివిటీని పెంచి ఇమ్యూనిటీ మెరుగై సంపూర్ణ ఆరోగ్యానికి కారణమవుతుంది
pexels
హగ్ చేసుకున్నప్పుడు డోపమైన్, సెరటోనిన్ స్థాయిలు పెరిగి యాంగ్జైటీ తగ్గుతుంది. హార్ట్ రేట్, బీపీ కూడా నియంత్రణలో ఉంటాయి
pexels
ఇష్టమైన వాళ్లను కౌగిలించుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరగవుతుంది. కార్టిసాల్ స్థాయిలు తగ్గి, ఆక్సిటోసిన్ పెరిగి డిప్రెషన్ లాంటి మానసిక రోగాలు దూరమవుతాయి
pexels
కౌగిలింత శరీరంలో సహజ నొప్పి నివారకాలైన ఎండార్ఫిన్లను రిలీజ్ చేస్తాయి. దీనివల్ల నొప్పి కూడా తగ్గుతుంది. కండరాలు రిలాక్స్ అయి, టెన్షన్ కూడా తగ్గుతుంది