ఫుడ్ అండ్ న్యూట్రిషన్ శాస్త్రం ప్రకారం  వంటల్లో వినియోగించే కొవ్వులు మూడు రకాలుగా విభజించారు.

By Bolleddu Sarath Chandra
Feb 05, 2025

Hindustan Times
Telugu

శాచురేటెడ్, మోనో అన్‌ శాచురేటెడ్,  పాలీ అన్‌ శాచురేటెడ్‌గా కొవ్వులు ఉంటాయి. వీటిలో ఒమెగా 3, ఒమెగా 6 వంటివి శరీరానికి అందుతాయి. శరీరంలో కణాలకు ఇవి శక్తిని అందిస్తాయి. కణాల ఎదుగుదలకు, చర్మం సాఫీగా పనిచేయడానికి ఒమెగా యాసిడ్స్‌ అవసరం.

శాచురేటెడ్ కొవ్వుల్లో వెన్న, కొబ్బరినూనె, పామాయిల్, మాంసపు కొవ్వులు ఉంటాయి. కృత్రిమ కొవ్వులు డాల్డా, వనస్పతిలోఉంటాయి.  ఇవి హానికరంగా పరిగణిస్తారు. 

మోనో శాచురేటెడ్, పాలీ శాచురేటెడ్ నూనెలు గది ఉష్ణోగ్రత వద్ద  ద్రవ రూపంలో ఉంటాయి.  వేడి చేస్తే వీటి కణవిభజన హానికరం అవుతుంది. 

కొవ్వు పదార్ధాల వల్ల బరువు పెరుగుతారనే వాదనలో కొంత వరకే నిజం ఉంది. బరువు పెరగడానికి ప్రధానంగా పిండి పదార్ధాలు కారణం అవుతాయి.

ఆహారంలో పిండి పదార్ధాలను పూర్తిగా వదిలేసి  మాంసం, చేపలు మాత్రమే తీసుకుంటే బరువు గణనీయంగా తగ్గుతారు.  తీపి పదార్ధాలు, బ్రెడ్‌, పాలు, మద్యం వదిలేసి ప్రొటీన్లను మాత్రమే తీసుకుంటే బరువు గణనీయంగా తగ్గుతున్నట్టు పరిశోధనలు వెల్లడించాయి. 

కేవలం కొవ్వు పదార్ధాలు మాత్రమే తీసుకునే ఆహారాన్ని 1860లో బాంటింగ్‌ పరిశోధనల్లో గుర్తించారు. 

కొబ్బరి నూనె శాచురేటెడ్ కావడంతో బరువు తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. 

కొవ్వు పదార్ధాల వల్ల బరువు పెరుగుతున్నారనేది పూర్తిగా వాస్తవ విరుద్ధం, కొవ్వులు మాత్రమే తినే వారిలో బరువు గణనీయంగా తగ్గుతున్న ఉదంతాలు ఉన్నాయి. 

కొలెస్ట్రాల్ గుండె రక్త నాళాలను మూసి వేస్తుందనే  వాదనలు కూడా పరిశోధనల్లో రుజువు కాలేదు.  రక్తనాళాలు పూడుకుపోవడం, గట్టి పడటం అథరోస్లిరోసిస్‌ అంటారు. 

రక్త నాళాలకు గాయాలు కావడానికి కొవ్వు పదార్ధాలకు సంబంధం లేదని పరిశోధనలు చెబుతున్నాయి.  రక్త నాళాలకు గాయాలై తర్వాత వాపుకు గురి కావడం, ఫలితంగా రక్త నాళాల్లోకి కొలెస్ట్రాల్, చీము  వ్యాపించడం వల్ల గుండె పోటు వస్తున్నట్టు గుర్తించారు.  కొలెస్ట్రాల్‌ తయారీ కాలేయంలోనే జరుగుతుంది. 

ఒక్క లైన్​తో జీవిత పాఠాలు నేర్పించిన తెలుగు సినిమా డైలాగ్​లు ఇవి..