కూరగాయలు, పండ్ల తొక్కలలో అనేక పోషకాలు ఉంటాయి. కానీ పురుగుమందుల నుండి రక్షించడానికి వాటిని సరిగ్గా కడగడం ముఖ్యం.
Unsplash
By Anand Sai Jul 01, 2025
Hindustan Times Telugu
కూరగాయల తొక్కల్లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇది శరీరాన్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Unsplash
తొక్కలపై ఉండే పురుగుమందులను సరిగ్గా తొలగించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రసాయనాలు దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపే అవకాశం ఉంది.
Unsplash
చాలా పండ్లు, కూరగాయలపై ఉన్న 75-80 శాతం పురుగుమందులను చల్లటి నీటిలో సరిగ్గా కడగడం ద్వారా తొలగించవచ్చు.
Unsplash
ఒక సీసాలో 1 లీటరు తాగునీటిని తీసుకోండి. దానికి 4 లెవెల్ టీస్పూన్ల ఉప్పు కలపండి. ఉప్పు పూర్తిగా కరిగిపోయే వరకు అలాగే ఉంచి తర్వాత కూరగాయలు, పండ్లు 10 నిమిషాలు పెట్టాలి. తర్వాత చల్లటి నీటితో కడగాలి.
Unsplash
క్యాబేజీ లాంటి కూరగాయలపై 2-3 ఆకులను తొలగించండి. ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి. భూమి లోపల నుంచి వచ్చే కూరగాయలను బ్రష్ ఉపయోగించి బాగా స్క్రబ్ చేసి కడగాలి.
Unsplash
పండ్లు చేతితో రుద్ది కడగాలి. ద్రాక్ష, బెర్రీలు ఉప్పు నీటి పద్ధతి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. తినడానికి ముందు పండ్లను మంచినీటితో కడగడం మర్చిపోవద్దు.
Unsplash
సబ్బు లేదా డిటర్జెంట్ వాడకండి. ఉప్పు నీటిని నిల్వ చేసి ఉపయోగించవద్దు. పండ్లు, కూరగాయలను ఎక్కువసేపు నానబెట్టడం వల్ల వాటిలోని పోషకాలు నష్టపోయే అవకాశం ఉంది.
Unsplash
క్యాబ్‌లో ప్రయాణించే మహిళలూ.. ఈ సేఫ్టీ టిప్స్‌ని మర్చిపోకండి!