మీరు కోడి గుడ్డు పెంకులు పడేస్తున్నారా? అయితే ఆ అలవాటు మానుకోండి. కోడి గుడ్డు పెంకుల్ని చెత్తలో పడేయకుండా వాటిని వివిధ మార్గాల్లో ఉపయోగించుకోవచ్చు. పాత్రలను క్లీన్ చేసే స్క్రబ్ నుంచి, ఫెర్టిలైజర్, టూత్ పేస్ట్ లా ఉపయోగించుకోవచ్చు.  

pexels

By Bandaru Satyaprasad
Apr 06, 2024

Hindustan Times
Telugu

మన ఆహారంలో గుడ్లు డైలీ వినియోగిస్తుంటాం. వీటిల్లోని పోషక విలువలు మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. గుడ్లతో వివిధ రకాల పదార్థాలు తయారు చేస్తుంటారు. గుడ్డు లోపలి పదార్థాన్ని వినియోగించుకుని పెంకులు పడేస్తుంటాం.   

pexels

కోడి గుడ్డు పెంకుల్లో కాల్షియం కార్బొనేట్, ఇతర ఖనిజాలు ఉంటాయి. వీటిని కిచెన్ తో పాటు గృహ అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఇవి సహజమైన క్లీనర్‌గా పనిచేస్తాయి.   

pexels

 క్లీనింగ్ కోసం- గుడ్డు పెంకుల్ని చూర్ణం చేసి కొద్దిగా నీరు, డిష్ సబ్బుతో కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోండి. ఈ పేస్టుతో వంట పాత్రలు, ఆయిల్ ఉన్న ప్యాన్ లను సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. వంటసామాను మెరిసేట్లు చేసుకునేందుకు ఈ పేస్టు ఉపయోగపడుతుంది.   

pexels

సూప్ లలో వాడుకోవచ్చు- గుడ్డు పెంకులను క్లీన్ చేసి వాటిని పొడిలా చేయండి. సూప్ లు చేసుకుంటున్నప్పుడు అందులో కొంచెం ఈ పొడిని వేసుకోండి. ఇది సూప్ రుచిని పెంచుతుంది. ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతుంది.   

pexels

సీడ్ స్టార్టర్స్- గుడ్డు పెంకులను సీడ్ స్టార్టర్‌లుగా వాడుకోవచ్చు. గుడ్డు పెంకును కుండ ఆకారంలో వచ్చేటట్టు చేసుకుని, వీటిలో కొంచెం మట్టి, విత్తనాలు వేయండి. గుడ్డు పెంకులు విత్తనాలు తొందరగా మొలకెత్తడానికి సాయపడతాయి.   

pexels

టూత్‌పేస్ట్- గుడ్డు పెంకులతో మీరే టూత్‌పేస్ట్ చేసుకోవచ్చు. గుడ్డు షెల్ బాగా కడిగి ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత మెత్తటి పొడిగా రుబ్బుకోవాలి. బేకింగ్ సోడా, కొబ్బరి నూనె కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. రిఫ్రెష్ రుచి కోసం పిప్పరమింట్ ఆయిల్ వేసుకోవచ్చు.   

pexels

ఫెర్టిలైజర్స్- కాల్షియం మట్టికి చాలా ముఖ్యమైనది. గుడ్డు పెంకులలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మొక్కల పెరుగుదలకు సాయపడతాయి. మొక్కల తెగుళ్లు, కీటకాల దాడిని నిరోధిస్తాయి.   

pexels

క్యాన్సర్ రకాలు, దశలెన్ని....? ఈ 6 విషయాలు తెలుసుకోండి

image credit to unsplash