మీరు మరింత నిజాయితీగా ఉండేందుకు అబద్ధం చెప్పే అలవాటును తగ్గించుకునేందుకు ఈ 7 చిట్కాలు ఉపయోగపడతాయి. 

pexels

By Bandaru Satyaprasad
May 26, 2024

Hindustan Times
Telugu

మీరు అబద్ధం చెప్పేటప్పుడు ఒక్క క్షణం ఆగండి. ఎందుకు అబద్ధం చెబుతున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అబద్ధం చెప్పే సందర్భాలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కొత్త మార్గాలు అన్వేషించండి. 

pexels

ఎవరైనా మమ్మల్ని బయటకు వెళ్దామని పిలిస్తే సరే అంటారు. మీకు ఇష్టం లేకపోయినా పిలిచిన వ్యక్తి కోసం వెళ్తారు. చిన్న అబద్ధాలు సామన్యమైనవిగా అనిపిస్తాయి, కానీ అవి మీపై ప్రభావం చూపుతాయి. మీ వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితానికి సరైన బౌండరీస్ సెట్ చేసుకోవాలి. మీ భావాలను నిజాయితీగా వ్యక్తం చేయాలి. 

pexels

మీ స్నేహితుడు సాయం కోరితే సరే అంటూ వాయిదా వేస్తారు. మీకు సాయం అందించే ఆలోచన లేనప్పుడు నిజాయితీగా చెప్పేయండి. అలాకాకుండా అబద్ధాలు చెబుతూ వాయిదా వేయడం మంచిది కాదు. నిజం చెబితే జరిగే వరెస్ట్ సినారియో ముందే ఊహించండి. నిజం చెబితే మీ స్నేహితుడు కాసేపు నొచ్చుకుంటాడు. కానీ అబద్ధం మీ మధ్య దూరం పెంచుతుంది.   

pexels

ఈ అబద్ధాల అలవాటు నుంచి విముక్తి కోసం, మెరుగైన వ్యక్తిగా మారే ప్రయాణం రాత్రికి రాత్రి మారిపోదు. ప్రతి రోజు ఎంతో కొంత నిజాయితీగా ఉండటానికి కట్టుబడి ఉండండి. ఈ రోజు సాధ్యం కాకపోతే రేపటి నుంచి మీ ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభించండి.   

pexels

 మీ ఆఫీసు లేదా ఫ్యామిలీ విషయాలపై ఆరా తీస్తూ మీ వ్యక్తిగత జీవితంలోకి చొరబడాలని ఎవరైనా ప్రయత్నిస్తుంటే, వారిని దూరంగా ఉంచేందుకు అబద్ధం చెప్పాలని అనిపించవచ్చు. అయితే మీరు అబద్ధాలు చెప్పాల్సిన అవసరంలేదు. కచ్చితంగా వాటిపై కామెంట్ చేయడాన్ని తిరస్కరించండి. మీరు చెప్పడానికి ఇష్టపడడంలేదని తెలిస్తే ఎదుటివారు అడగడం మానేస్తారు.  

pexels

మనం ఇమేజ్ అనే అబద్ధాల ముసుగులో బతుకుతుంటాం. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మనల్ని ఇష్టపడాలని కోరుకుంటున్నాం, అందుకోసం అబద్ధాలు ఆడేందుకు వెనకాడం. ఇమేజ్ కాపాడుకోవడానికి చెప్పే ఒక్క అబద్ధం వందల అబద్ధాలకు దారితీస్తుంది. కటువుగా అనిపించినా నిజం చెప్పేందుకే ప్రయత్నించండి. అప్పుడు నిజాయితీ ఉన్న వాళ్లే మీ పక్కన నిలుస్తారు.  

pexels

వృత్తిపరమైన సహాయం- అబద్ధాల అలవాటును మానుకోవాలనిపిస్తే నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది. మీ థెరపిస్ట్ లేదా కౌన్సెలర్ మాట్లాడి మరింత మెరుగైన సూచనలు తీసుకోవచ్చు. నిజాయితీగా ఉంటూ మీలో ఉన్న కొత్త వ్యక్తిని మీకు మీరే పరిచయం చేసుకోండి.   

pexels

వెల్లుల్లిని ఇలా వినియోగిస్తేనే ఎక్కువ ఆరోగ్య  ప్రయోజనాలు..!

image credit to unsplash