యూరిక్ యాసిడ్ తగ్గటం ఎలా...? ఈ విషయాలు తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Jan 30, 2025
Hindustan Times Telugu
శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. కిడ్నీ వ్యాధులు, గుండెతో పాటు కీళ్ల వంటి సమస్యలు వస్తాయి. కొన్ని రకాల పండ్లతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
image credit to unsplash
రక్తంలో యూరిక్ యాసిడ్‌ను తగ్గించడానికి అరటి పండు చాలా ఉత్తమమైనది. అరటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలోని యూరిక్ యాసిడ్ తగ్గుముఖం పడుతుంది.
image credit to unsplash
ఆపిల్ పండులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
image credit to unsplash
యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారికి మేలు చేసే మరో పండు పైనాపిల్. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. పైనాపిల్‌లోని విటమిన్ సి... మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ విసర్జనను పెంచడంలో సహాయపడుతుంది.
image credit to unsplash
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే విషయంలో చెర్రీలు బాగా పని చేస్తాయి. చెర్రీస్‌లోని ఆంథోసైనిన్స్ యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రిస్తాయి.
image credit to unsplash
నారింజ, నిమ్మకాయలు వంటి పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
image credit to unsplash
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో కాఫీ సహాయపడుతుంది. అంతేకాదు గ్రీన్ టీలో ఉండే పలు సమ్మేళనాలు యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని తగ్గించగలవని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
image credit to unsplash
ఎగ్జామ్స్ రోజుల్లో మంచి, నాణ్యమైన నిద్రకు ఈ చిట్కాలు పాటించాలంటున్న సర్రే విశ్వవిద్యాలయం