యూరిక్ యాసిడ్ సహజంగా తగ్గటం ఎలా...? ఈ పుడ్స్ తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary May 23, 2025
Hindustan Times Telugu
యూరిక్ యాసిడ్ శరీరంలో పెరగడం అనేది తీవ్రమైన సమస్యలకు కారణం అవుతుంది. దీన్ని ఎక్కువ కాలం పాటు నిర్లక్ష్యం చేస్తే సమస్యలు ఎక్కువవుతాయి.
image credit to unsplash
యూరిక్ యాసిడ్ ఎక్కువైతే గౌట్ వ్యాధి బారిన పడుతారు. ఇలాంటి వారు అరటి పండు క్రమంగా తీసుకోవాలి. రక్తంలో యూరిక్ యాసిడ్‌ను తగ్గించడానికి అరటిపండు బాగా పని చేస్తుంది. వీటిలో ప్యూరిన్ చాలా తక్కువగా ఉంటుంది.
image credit to unsplash
యాపిల్స్‌లో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. ఫైబర్.... రక్తప్రవాహం నుంచి యూరిక్ యాసిడ్‌ను గ్రహిస్తుంది. శరీరం నుండి అదనపు యూరిక్ యాసిడ్‌ను తొలగిస్తుంది.
image credit to unsplash
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి చెర్రీలు బాగా పని చేస్తాయి. వీటిలోని ఆంథోసైనిన్స్ అయూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రిస్తుంది.
image credit to unsplash
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో కాఫీ సహాయపడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే ఈ విషయంలో వైద్యుడి సలహా తీసుకోవటం ఉత్తమం.
image credit to unsplash
నారింజ, నిమ్మకాయలు వంటి పండ్లలో విటమిన్ సి ఎక్కవగా ఉంటుంది. ఇవి శరీరంలో ఆరోగ్యకరమైన యూరిక్ యాసిడ్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతాయి. అదనపు యూరిక్ యాసిడ్‌ను సమర్థవంతంగా బయటకు పంపగలవు.
image credit to unsplash
అల్లం టీ కూడా యూరిక్ యాసిడ్ లెవల్స్ ను తగ్గించటంలో సహాయపడుతుంది. కేవలం టీ మాత్రమే కాదు... తురిమిన అల్లం ముక్కులను తీసుకున్నా ఫలితం ఉంటుంది.
image credit to unsplash
మొబైల్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ 5 స్మార్ట్ టిప్స్ ఫాలో అవ్వండి