లైంగికంగా సంక్రమించే సుఖవ్యాదులు తగ్గటం ఎలా..!

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Feb 18, 2025

Hindustan Times
Telugu

లైంగికంగా కొన్ని సుఖవ్యాధులు సంక్రమిస్తుంటాయి. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటే  భారీ మూల్యం చెల్లించక తప్పదు.

image credit to unsplash

లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల్లో అనేక రకాలు ఉన్నాయి. కొన్ని లక్షణాలను చూపించవచ్చు లేదా చూపించకపోవచ్చు. లక్షణాలు కనిపిస్తే సులభంగా గుర్తించి వాటిని నయం చేయవచ్చు.

image credit to unsplash

 సిఫిలిస్‌, గనోరియా వంటి బ్యాక్టీరియా కారణంగా  సుఖవ్యాధులు సంక్రమిస్తాయి. సుఖవ్యాధుల విషయంలో చికిత్స కన్నా నివారణే ప్రధానమని నిపుణులు సూచిస్తున్నారు.

image credit to unsplash

జీవిత భాగస్వామితో తప్ప ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకోకపోవటం చాలా అవసరం. ఒకవేళ ఇతరులతో ఎప్పుడైనా సెక్స్‌లో పాల్గొంటే తప్పనిసరిగా కండోమ్‌ ధరించాలి. 

image credit to unsplash

భార్యాభర్తల్లో ఎవరికైనా జననాంగాల వద్ద ఇబ్బందిగా అనిపించినా, ఇతరత్రా లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

image credit to unsplash

ఒకరి కన్నా ఎక్కువమందితో లైంగిక సంబంధాలు ఉన్నవారు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. లేదంటే వారికి తెలియకుండానే ఈ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.

సుఖ వ్యాధులకు రాకుండా ఉండాలంటే జననేంద్రియాల పరిశుభ్రత గురించి అవగాహాన పెంపొందించుకోవాలి.  సెక్స్ ఎడ్యుకేషన్, సుఖవ్యాధుల పట్ల అవగాహన, సురక్షిత సెక్స్ పద్ధతులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

image credit to Twitter

ఉదయం లేవగానే ఒళ్లంతా నొప్పులుగా ఉంటుందా?.. ఇలా చేయండి!