ఈ చలికాలంలో కఫం సమస్యలా..! ఇలా వదిలించుకోండి

image source https://unsplash.com/

By Maheshwaram Mahendra Chary
Dec 05, 2024

Hindustan Times
Telugu

కఫం సమస్య తగ్గాలంటే ఉప్పు నీళ్లు ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. ఒక గ్లాస్‌ గోరువెచ్చని నీళ్లలో ఒక టేబుల్‌స్పూన్‌ ఉప్పు వేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది.

image source https://unsplash.com/

పుదీనా ఆకులను బాగా మరిగించి వ‌డ‌బోసుకోవాలి. ఈ నీటిలో కొద్దిగా నిమ్మ ర‌సం క‌లిపి తాగితే కఫం త్వరగా కరుగుతుంది.

image source https://unsplash.com/

అల్లం నీటిని తాగడం వల్ల కఫం బయటకు వస్తుంది. అలాకాకుండా అల్లం టీ తాగినా రిలీఫ్ ఉంటుంది.

image source https://unsplash.com/

చలికాలంలో జలుబు, దగ్గుకు మంచి హోమ్ రెమెడీగా యాలకులు పని చేస్తాయి. యాలకులను వేడి నీటిలో వేసి తాగడం వల్ల కఫం సమస్య తగ్గుతుంది.

image source https://unsplash.com/

పచ్చి వెల్లుల్లి తినడం లేదా నీళ్లు తాగడం వల్ల కఫం కరిగిపోతుంది. మంచి రిలీఫ్ దొరుకుంతుంది.

image source https://unsplash.com/

ఈ చలికాలంలో ఉదయం లేవగానే గోరు వెచ్చని నీరు రెండు గ్లాసులు తీసుకోవాలి. క్రమంగా తీసుకుంటే కఫం సమస్య తగ్గుతుంది.

image source https://unsplash.com/

దానిమ్మ తొక్కలతో చేసే టీ తాగితే కఫం సమస్య వెంటనే తగ్గిపోతుంది. దానిమ్మ తొక్కల్లో ఉండే పోషకాలు సీజనల్ గా వచ్చే రోగాలను అదుపులో ఉంచుతాయి.

image source https://unsplash.com/

విటమిన్ కే మన గుండె, ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది లభించే ఏడు సూపర్ ఫుడ్స్ ఏవో చూడండి.

pexels