వేసవి వేళ చాలా మంది చెమట, దుర్వాసన సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. ఈ వాసనను తొలగించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని సులభమైన పద్ధతులతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
image credit to unsplash
ఈ వేసవి వేళ సాధ్యమైనంత ఎక్కువ నీటిని తాగాలి. అప్పుడే మలినాలన్నీ బయటకు పోయి శరీరం తాజాగా ఆరోగ్యంగా ఉంటుంది.
image credit to unsplash
ముఖ్యంగా ఈ వేసవి వేళ నీరు తగినంత తాగకపోతే శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవిస్తాయి. ఇది ప్రధానంగా దుర్వాసనకు దారి తీస్తుంది.
image credit to unsplash
వేసవి సమయంలో ఎక్కువ ఘాటు ఉండే పదార్థాలకు దూరంగా ఉండటం మంచింది. నాన్ వెజ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.
image credit to unsplash
చేపలు, వెల్లుల్లి, ఉల్లి, ఆల్కహాల్ వంటివాటిని కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. లేకపోతే శరీరం నుంచి దుర్వాసన ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కొత్తిమీర, పుదీనాల జ్యూస్ తాగితే చాలా మంచిది.
image credit to unsplash
ముఖ్యంగా ఈ వేసవి వేళ లోదుస్తులను క్రమం తప్పకుండా మార్చుకోవాలి. శుభ్రమైన వాటిని వాడకపోతే... దుర్వాసన అధికంగా వస్తుంది.
image credit to unsplash
వేసవి సీజన్ లో రోజూ రెండు పూటల స్నానం చేయాలి. డియోడ్రంట్స్ ను ఉపయోగించేవాళ్లు... నాణ్యమైన వాటికే ప్రయారిటీ ఇవ్వాలి. లేకపోతే చర్మ సమస్యలు వస్తాయి.
image credit to unsplash
ఈ వేసవిలో సాక్స్‌లను ధరించకుండా ఉంటే మేలు. ఒకవేళ వేసుకోవాల్సి వస్తే రోజూ మార్చాల్సిందే. అంతేకాకుండా జీవనశైలిలో కూడా స్వల్ప మార్పులు చేసుకోవాలి.
image credit to unsplash
తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ - మే తొలివారంలో మళ్లీ వర్షాలు..!