వేసవిలో ముక్కు నుండి రక్తం కారకుండా ఎలా నివారించాలి? 8 అంశాలు
Image Source From unsplash
By Basani Shiva Kumar May 05, 2025
Hindustan Times Telugu
వేసవిలో శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. డీహైడ్రేషన్ ముక్కులోని పొరలను పొడిగా మార్చి, పగలడానికి, రక్తస్రావం కావడానికి అవకాశం కలిగిస్తుంది. కాబట్టి, రోజంతా తగినంత నీరు తాగాలి.
Image Source From unsplash
ముక్కు లోపలి భాగాన్ని పొడిబారకుండా ఉంచడానికి వాసెలిన్, ప్రత్యేకమైన ముక్కు మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి. రోజుకు రెండు లేదా మూడుసార్లు కొద్ది మొత్తంలో రాయాలి.
Image Source From unsplash
వీలైనంత వరకు నేరుగా సూర్యరశ్మి తగలకుండా, వేడి ఎక్కువగా లేని ప్రదేశాల్లో ఉండటానికి ప్రయత్నించాలి.
Image Source From unsplash
మీ ఇంట్లో లేదా కార్యాలయంలో గాలి పొడిగా ఉంటే.. ఏసీలు లేదా హ్యూమిడిఫైయర్ ఉపయోగించాలి. దీనివల్ల గాలిలో తేమ పెరుగుతుంది. ముక్కు పొడిబారకుండా ఉంటుంది.
Image Source From unsplash
ముక్కు దిబ్బడగా ఉన్నప్పుడు గట్టిగా చీదితే రక్తనాళాలు పగిలి రక్తస్రావం కావచ్చు. మెల్లగా చీదాలి. సెలైన్ స్ప్రే ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.
Image Source From unsplash
ముక్కు లోపల దురదగా అనిపించినా లేదా పొలుసులు ఉన్నా గోకడం మానుకోవాలి. గోకడం వల్ల రక్తనాళాలు దెబ్బతిని రక్తస్రావం కావచ్చు.
Image Source From unsplash
రాత్రిపూట నిద్రపోయేటప్పుడు తల కొంచెం ఎత్తుగా ఉండేలా దిండు పెట్టుకోవడం వల్ల ముక్కుపై ఒత్తిడి తగ్గుతుంది. రక్తస్రావం నివారించవచ్చు.
Image Source From unsplash
తరచుగా ముక్కు నుండి రక్తం కారుతుంటే లేదా ఎక్కువ మొత్తంలో రక్తస్రావం అవుతుంటే.. తప్పకుండా వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
Image Source From unsplash
మీరు రోజుకు ఎంత సేపు నడుస్తున్నారో ఎప్పుడైనా గమనించారా? కొందరు కిలో మీటర్ల దూరం, గంటల తరబడి నడుస్తుంటారు. మరికొందరు కేవలం 30 నిమిషాలు కూడా నడవరు. మనం రోజుకు 40 నిమిషాలైనా నడిస్తే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.