మగవారిని  బాధించే ప్రొస్టేట్‌ సమస్య నుంచి విముక్తి పొందడం ఎలా అంటే ..                   

By Bolleddu Sarath Chandra
Jan 08, 2025

Hindustan Times
Telugu

ప్రొస్టేట్ గ్రంథి మగవారిలో పొత్తి కడుపులో మూత్రపుతిత్తికి దిగువున మూత్రనాళం పైభాగంలో ఉంటుంది. 

పురుషుల్లో మాత్రమే ఉండే గ్రంథి కావడంతో దీనిని పౌరుష గ్రంథి అని కూడా అంటారు. 

ప్రొస్టేట్ గ్రంథి స్రావాలను, ఎంజైములను ఉత్పత్తి చేస్తుంది.వృషణాల్లో ఏర్పడిన శుక్ర కణాలకు ద్రవాలను అందచేయడం, శుక్ర కణాలను అండ కణాలతో కలిసేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

పురుష మూత్ర మార్గానికి సంబంధించిన  సమస్యల్లో ప్రొస్టేట్ గ్రంథి సమస్యలు ముఖ్యమైనవి. దీనికి ఇన్ఫెక్షన్‌ సోకినా, పరిణామం పెరిగినా, క్యాన్సర్ సోకినా మూత్ర విసర్ఝనకు సంబంధించిన సమస్యలు వస్తాయి

మలబద్దకం ఎదుర్కొనే వారిలో మల విసర్ఝన సమయంలో గట్టిగా ముక్కితే ప్రొస్టేట్ గ్రంథిపై పీడనం పెరిగి వీర్యం బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. 

ప్రొస్టేట్‌ గ్రంథుల్లో వాపు సాధారణ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇన్ఫెక్షన్లు, వాపుతో కూడిన ప్రొస్టేట్‌ను  ప్రొస్టాటైటిస్‌ అంటారు. ఈ సమస్య ఉన్న వారిలో మూత్ర విసర్ఝనలో మంట, నొప్పి, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడంతో వంటి సమస్యలు ఉంటాయి. మూత్ర విసర్ఝన సమయంలో తీవ్రమైన మంట కలుగుతుంది. 

ప్రొస్టేట్ సమస్య ఉన్న వారిలో వణుకు, జ్వరం, కండరాల నొప్పుల, కీళ్ల నొప్పులు ఉంటాయి.

లైంగిక చర్యల్లో పాల్గొన్నపుడు వీర్య స్ఖలనం జరిగే సమయంలో తీవ్రమైన మంట, నొప్పి కలుగుతాయి.  పొత్తి కడుపు, తొడల భాగంలో నొప్పి ఉ:టుంది. 

50ఏళ్లు పైబడిన వారిలో  హార్మోన్ల ఉత్పత్తిలో మార్పు  వల్ల ప్రొస్టేట్ గ్రంథి పెరగడం వల్ల మూత్ర విసర్ఝన సమయంలో ఇబ్బందులు కలుగుతాయి. 30-40శాతం మందిలోమూత్ర మార్గం నొక్కుకు పోయి మూత్ర విసర్జన తీరులో మార్పులు వస్తాయి. 

ప్రొస్టేట్ సమస్యను తొలి దశలో గుర్తిస్తే చిట్కా వైద్యంతో కూడా  నియంత్రించవచ్చు.  నిత్యం 10మి.లీ ఉల్లిపాయ రసంలో రెండు చెంచాల తేనె కలుపుకుని తాగితే ప్రొస్టేట్  సమస్యలు తగ్గుతాయి.  ఉసిరి చుర్ణం, పసుపు కలిపి ఉంచుకుని నిత్యం రెండుపూటలా తేనెతో తీసుకుంటే ఫలితం ఉంటుంది. 

నాన్ వెజ్ ఫుడ్ ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలకు మూలం. పౌల్ట్రీ, చేపలు, లీన్ మీట్ వంటి వివిధ రకాల మాంసాహార పదార్థాలను మన డైట్ లో చేర్చుకోవడం ముఖ్యం. 

pexels