పిల్లలకు ఇష్టమైన వాటర్‌మిలన్ ఐస్‌క్రీమ్.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. చాలా ఈజీ!

Image Source From unsplash

By Basani Shiva Kumar
May 18, 2025

Hindustan Times
Telugu

ఒక మీడియం సైజు పుచ్చకాయను తీసుకొని దాని తొక్క తీసేయాలి. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేయాలి. గింజలు ఉంటే తీసేయాలి

Image Source From unsplash

కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలను బ్లెండర్‌లో వేసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి.

Image Source From unsplash

మృదువైన ఐస్‌క్రీమ్ కావాలంటే.. పుచ్చకాయ గుజ్జును ఒక పలుచని వస్త్రం లేదా జల్లెడతో వడకట్టాలి. ఇది పిప్పిని తొలగిస్తుంది.

Image Source From unsplash

రుచికి తగినంత చక్కెర లేదా తేనె కలపాలి. చక్కెర పూర్తిగా కరిగిపోయేలా కలపాలి. కొంచెం నిమ్మరసం కూడా కలపవచ్చు.

Image Source From unsplash

అన్నీ కలిపిన తర్వాత మిశ్రమాన్ని గాలి చొరబడని గ్లాసులో పోయాలి. కనీసం 4 నుంచి 6 గంటల వరకు ఫ్రీజర్‌లో ఉంచాలి.

Image Source From unsplash

మరింత క్రీమీగా ఉండాలంటే.. ప్రతి గంటకు ఒకసారి ఫ్రీజర్‌ నుంచి తీసి బాగా కలపాలి. ఇలా 2 నుంచి 3 సార్లు చేస్తే బాగుంటుంది.

Image Source From unsplash

ఐస్‌క్రీమ్ గట్టిపడిన తర్వాత.. స్కూప్‌తో తీసి చల్లగా ఆస్వాదించవచ్చు. పిల్లలు దీన్ని ఇష్టంగా తింటారు.

Image Source From unsplash

ఐస్‌క్రీమ్ అయ్యాక.. కావాలంటే పుదీనా ఆకులు లేదా చిన్న పుచ్చకాయ ముక్కలతో అలంకరించుకోవచ్చు. ఇలా చేస్తే బాగుంటుంది.

Image Source From unsplash

మీరు ఉదయమే కొంచెం లెమన్ గ్రాస్ టీ తీసుకోండి.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు