అమ్మ చేతి రుచితో.. పనస కాయ గ్రేవీ కూర ఇలా వండేయండి..

By Koutik Pranaya Sree
Jun 27, 2024

Hindustan Times
Telugu

ముందుగా పనస కాయను ముక్కలుగా కోసుకోవాలి. గింజలకున్న తొక్క తీసేసి వాటినీ ముక్కలుగా చేసుకోవాలి.

పళ్లెంలో కనిపిస్తున్న పదార్థాలన్నీ సిద్దం చేసి పెట్టుకోండి

కడాయిలో నూనె వేసుకుని ముందుగా పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కల్ని రంగు మారేదాక వేయించుకోవాలి. 

కడాయిలో నూనె వేసుకుని దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ప్లేట్ లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. 

అదే నూనెలో మీకిష్టమున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకోండి. బంగారు వర్ణంలోకి మారాక ప్లేట్ లోకి తీసుకోండి. 

వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, ఉల్లిపాయల మిశ్రమాన్ని చల్లార్చి మెత్తగా మిక్సీ పట్టుకోండి.

అదే కడాయిలో మరికొంత నూనె వేసుకుని పనస ముక్కల్ని వేయించుకోవాలి. కాస్త మెత్తబడ్డాక ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గనివ్వాలి. 

Unsplash

పనస ముక్కలు బాగా మగ్గాక, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఉడికిస్తే.. పనస కాయ కూర రెడీ..

బీచ్‌లో లవర్‌తో ఎంజాయ్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటి ఇనయా సుల్తానా

Instagram