బరువు తగ్గడానికి జీలకర్ర నీటిని ఎలా తయారు చేయాలి, రెసిపీ తెలుసుకోండి
By Sudarshan V May 20, 2025
Hindustan Times Telugu
జీలకర్ర నీరు బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఎసిడిటీ, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది.
బరువు తగ్గడానికి జీలకర్ర దోహద పడుతుంది. జీలకర్ర జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. గట్ హెల్త్ ను మెరుగు పరుస్తుంది.
ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టాలి. దీనివల్ల జీలకర్ర తమ పోషకాలను నీటిలోకి విడుదల చేస్తుంది. నానబెట్టడం దాని ప్రయోజనాలను మరింత పెంచుతుంది.
ఉదయాన్నే ఆ జీలకర్ర నీటిని కొద్ది సేపు వేడి చేయాలి. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. వేడి నీరు శరీరంలో త్వరగా పనిచేసి కొవ్వును కరిగిస్తుంది.
ఉదయాన్నే పరగడుపున ఆ గోరువెచ్చని జీలకర్ర నీటిని తాగాలి. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. శరీర కొవ్వును కరిగిస్తుంది. గుర్తుంచుకోండి, దీని తరువాత 30 నిమిషాలు ఏమీ తినవద్దు.
అందులో కొంచెం నిమ్మకాయ రసం పిండి రుచిని పెంచుకోవచ్చు. నిమ్మకాయ శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. బరువు తగ్గడానికి జీలకర్రతో కలిసి రెట్టింపు ప్రయోజనాలను ఇస్తుంది.
దీన్ని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది కాలక్రమేణా ప్రభావాన్ని చూపుతుంది. బెల్లీ ఫ్యాట్ క్రమంగా తగ్గుతుంది.
బరువు తగ్డడానికి జీలకర్ర నీటిని తీసుకోవడంతో పాటు ఆహారంపై నియంత్రణ ఉండాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలి.
నీట్ ఫలితాలు 2025: తమిళనాడులో టాప్ 7 మెడికల్ కాలేజీలు