అల్లంతో అద్భుత  ప్రయోజనాలు.. అజీర్ణ వ్యాధులకు అద్భుతమైన ఔషధం

By Bolleddu Sarath Chandra
Feb 07, 2025

Hindustan Times
Telugu

అల్లాన్ని చైనా, భారత్‌, తైవాన్ దేశాల్లో విరివిగా పండిస్తారు. దేశంలో కేరళలో పండే అల్లాన్ని నాణ్యమైనదిగా  పరిగణిస్తారు.

వైదిక కాలం నుంచి అల్లాన్ని ఔషధంగా వినియోగిస్తున్నారు. శరీరంలో దోషాలను తొలగించడానికి అల్లాన్ని వినియోగించవచ్చని  గ్రీకులు విశ్వసించారు. 

అజీర్ణ వ్యాధులకు అల్లం అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. ఉదర సంబంధ వ్యాధులకు అల్లాన్ని మించిన  వైద్యం లేదని ఆయుర్వేద గ్రంథాలు పేర్కొంటున్నాయి. 

తాజా అల్లం ముక్కను నోట్లో పెట్టుకుని చప్పరిస్తే ఉదర సంబంధ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. 

ఒక టీ స్పూన్ అల్లం రసాన్ని టీ స్పూన్‌ నిమ్మ రసం, పుదీనా రసం, తేనెలో కలిపి సేవిస్తే కడుపులో వికారాలను తొలగిస్తుంది.

ఉదయం పూట పొట్టలో కలిగే వికారాలు, కామెర్లు, మూలశంక వ్యాధులు అల్లంతో దూరం చేసుకోవచ్చు. 

దగ్గు జలుబులకు అల్లం అద్భుతంగా పనిచేస్తుంది.  అల్ం రసాన్ని తేనెలో కలిపి తాగితే  జలుబు, దగ్గు తగ్గుతాయి. 

అల్లాన్ని చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి కప్పు నీటిలో మరగబెట్టి, వేడి నీటిలో కొద్దిగా పంచదార కలిపి సేవిస్తే జలుబు తగ్గుతుంది. 

అల్లం ముక్కల్ని మరగబెట్టి, తేయాకుతో కలిపి టీ సేవిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి. 

అల్లం పెయిన్‌ కిల్లర్‌గా కూడా పనిచేస్తుంది. అన్ని రకాల నొప్పులకు ఔషధంా పనిచేస్తుంది. 

ఎండిన అల్లాన్ని కొంచెం నీటితో కలిపి ముద్దగా తయారు చేసి నుదురుకు రాస్తే తలనొప్పి తగ్గుతుంది. 

అల్లం రసం చెవిలో వేస్తే చెవినొప్పి తగ్గుతుంది. 

రుతు సంబంధిత సమస్యల పరిష్కారంలో కూడా అల్లం ఉపయోగపడుతుంది. 

తాజా అల్లాన్ని కప్పు నీటిలో వేడి చేసి రోజుకు మూడు సార్లు భోజనం తర్వాత తీసుకుంటే రుతు సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.

ఔషధ గుణాలు మెండుగా ఉండే అల్లాన్ని అన్ని వయసుల వారు ఆహారంలో తీసుకోవచ్చు.  

లవంగాల వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుందా!

Photo: Pexels