పుచ్చకాయను వేసవిలో తింటే ఎంతో మంచిది. కానీ ఈ పుచ్చకాయను కల్తీ చేసేస్తున్నారు. రసాయనాలు కలుపుతున్నారు. మరి పుచ్చకాయలో రసాయనాలు ఇంజెక్ట్ చేశారా లేదా అన్నది ఈ ఆరు మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు
pexels
By Hari Prasad S Mar 19, 2025
Hindustan Times Telugu
పుచ్చకాయ కొన్ని చోట్ల మెత్తగా, మరికొన్నిచోట్ల గట్టిగా అనిపిస్తూ ఉంటే అందులోకి రసాయనాలు ఇంజెక్ట్ చేశారని అర్థం చేసుకోండి
pexels
పుచ్చకాయ వెలుపల అసహజంగా పగుళ్లు కనిపిస్తున్నాయంటే దానిలోకి రసాయనాలను పంపించినట్లుగా భావించవచ్చు
pexels
పుచ్చకాయ లోపల దూదితో కాస్త నొక్కండి. దూది ఎరుపు రంగులోకి మారిందంటే అందులో రసాయనాలు ఉన్నట్లే.
pexels
పుచ్చకాయ బయట తెల్లటి పౌడర్ లాంటి లేయర్ ఏదైనా కనిపించిందంటే అందులోకి కృత్రిమ రసాయనాలను పంపినట్లే
pexels
ఎలాంటి రసాయనాలు కలపని పుచ్చకాయ లోపలి రంగు సహజంగా ఉంటుంది. ఒకవేళ మీరు కొన్న పుచ్చకాయలో కలర్ మరీ ఎక్కువ ఎరుపు రంగులో, షైనింగా కనిపించిందంటే అందులో రసాయనాలు ఉన్నట్లే
pexels
ఓ పుచ్చకాయ ముక్కను నీటిలో వేసి చూడండి. ఒకవేళ అది నీటిలోకి రంగును వదిలిందంటే అందులో రసాయనాలు కలిపినట్లు తేలిపోతుంది
pexels
ఇలా రసాయనాలు కలిపిన పుచ్చకాయ తినడం వల్ల ఆరోగ్యం కంటే ఫుడ్ పాయిజనింగ్, జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది
pexels
విరాట్ కోహ్లీ రోజువారీ డైట్ రొటీన్ ఏముంటాయో తెలుసా?