రక్తంలో హిమోగ్లోబిన్ అనేది చాలా ముఖ్యమైనది. హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువ ఉంటే రక్తహీనత తలెత్తుతుంది. ఇది సరైన స్థాయిలో ఉంటే ఆరోగ్యంగా ఉంటారు.
image credit to unsplash
హీమోగ్లోబిన్ పెరిగే విషయంలో ఎండుద్రాక్ష కీలకంగా పని చేస్తుంది. ఇందులో ఐరన్, రాగి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల అభివృద్ధికి, హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి తోడ్పడతాయి.
image credit to unsplash
ఖర్జూరం పండ్లలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇంకా విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. రక్తహీనతను నివారించటానికి ఇవి తినాలి.
image credit to unsplash
అల్ల నేరేడు, డ్రై ఫ్రూట్స్, రాగులు, పప్పులు, మునగ ఆకులు, బెల్లం మొదలగు వాటిల్లో కూడా ఐరన్ ఉంటుంది. ఇవి హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి.
image credit to unsplash
ఐరన్ ప్రధానంగా దొరికే పదార్థం బెల్లం. దీన్ని తరచూ ఆహారంలో తీసుకుంటే రక్తహీనత దరికి చేరదు. హీమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది.
image credit to unsplash
గుడ్డు కూడా ఐరన్‌కి మూలం. దీనిని తినడం వల్ల కూడా హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
image credit to unsplash
దానిమ్మలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అయితే దానిమ్మ గింజల్ని తీసుకున్నా, ఆ జ్యూస్ తాగినా హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
image credit to unsplash
జామకాయతోనే కాదు జామ ఆకులతోనూ అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఖాళీ కడుపుతో ఈ ఆకులను మరిగించిన నీరు తాగితే ఉపయోగం ఉంటుంది.