సొరియాసిస్‌ను గుర్తించడం ఎలా..లక్షణాలు ఎలా ఉంటాయి...

By Sarath Chandra.B
Feb 17, 2025

Hindustan Times
Telugu

సొరియాసిస్‌లో ప్రధానంగా నీలం, ఎరుపు కలిపిన పింక్‌ లేదా చేప పొలుసల్లా మెరుస్తూ ఉండే చర్మపు మచ్చలు ఏర్పడతాయి. ఇందులో దురద కూడా ఉంటుంది.

చర్మ వ్యాధులతో బాధపడే వారిలో ప్రతి వందమందిలో కనీసం పదిమందిలో సొరియాసిస్‌ సమస్యతో బాధపడుతున్నారనే అంచనాలు ఉన్నాయి.

సొరియాసిస్‌ దీర్ఘకాలిక చర్మ సమస్య, ఇది వస్తూ పోతూ ఉంటుంది. శాశ్వత పరిష్కారం ఉండకపోవచ్చు.

మచ్చలు గరుకుగా ఉండి, గోకితే చేప పొలుసుల మాదిరి వెండి రంగులో  రాలిపోవడం,  ఆ స్థానంలో కొత్తవి రావడం, రాలిన చోట తడిగా ఉండటం ప్రధానంగా గుర్తించవచ్చు.

ఈ వ్యాధి కొంత కాలం ఉధృతంగా ఉంటుంది. మరికొంత కాలం అసలు లేకుండా పోతుంది. తలలో వచ్చే సొరియాసిస్‌ను చుండ్రుగా పొరబడే అవకాశం ఉంటుంది. సొరియాసిస్‌లో పొలుసులు పెద్దవిగా ఉంటాయి. పొలుసులు లేని చోట తలమీద చిన్న చిన్న పొక్కులు చేతికి తగులుతాయి.  బాగా అదిమి దువ్వితే తలకు రక్తపు జీర అంటుతుంది.

సొరియాసిస్‌ రావడానికి నిర్దిష్ట కారణాలు ఏవీ ఇంతవరకు  నిర్దారణ కాలేదు.సొరియాసిస్ వంశపారంపర్యంగా వస్తుందని, శరరీంలో కొవ్వుకు సంబంధించిన మెటబాలిజంలో తేడాల వల్ల కొన్ని గ్రంథుల్లో ఏర్పడే స్రావాలలో లోపాల వల్ల ఇది వస్తుంది.

సొరియాసిస్‌ రావడానికి ప్రధానంగా శారీరక, మానసిక సమస్యలు కారణం అవుతాయి. మానసికంగా దిగులు, ఆందోళన ఉన్న వారిలో సొరియాసిస్‌ ఎక్కువగా కనిపిస్తుంది.

వంశ పారంపర్యంగా సంక్రమిస్తుందనే వారి వాదన ప్రకారం కొందరిలో సొరియాసిస్ వ్యాధి ఉన్నా  అది బయటపడకుండా అంతర్గతంగా ఉంటుంది.  ఏవైనా గాయాలు తగిలినపుడు, ఒంటిమీద ఒరిపిడి పెరిగినపుడు సొరియాసిస్‌ బయటపడుతుంది.

సొరియాసిస్‌ శీతాకాలంలో తక్కువగా, ఎండా కాలంలో తక్కువగా కనిపిస్తుంది.  సొరియాసిస్‌ లక్షణాలు కాలి గోళ్ల నుంచి తల వెంట్రుకల వరకు ఎక్కడైనా రావచ్చు

సొరియాసిస్‌ వ్యాధిలో మొదట సూది మొన అంత పరిమాణంలో  చుక్కలు ఏర్పడి క్రమంగా రుపాయి బిళ్లకు మించిన పరిమాణానికి అవి పెరుగుతాయి.

దురద అరుదుగా ఉంటుంది. ఉన్నా తక్కువగానే ఉంటుంది.  గట్టిగా గోకితే శరీరంలో మచ్చలు ఏర్పడతాయి.

మోచేతి వెనుక, మోకాళ్ల ముందు, తలలో, కాళ్ల మీద, చేతుల మీద, పాదాలలో, కీళ్లలో కూడా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది.

సొరియాసిస్‌ చికిత్సకు రకరకాల మందులు అందుబాటులో ఉన్నా మనసును ప్రశాంతంగా ఉంచడమే అసలై ఔషధంగా  గుర్తించారు.ఒత్తిడి, ఆందోళన లేకుండా ఉండాలి. 

 రోజంతా చురుకుగా ఉండటానికి మీకు శక్తినిచ్చే 6 సూపర్ ఫుడ్స్ 

pixa bay