డయాబెటిస్ రోగుల్లో సాధారణంగా కనిపించే సమస్యల్లో శృంగారంపై ఆసక్తి తగ్గడం ఒకటి. అంగస్తంభన సమస్యలు కూడా ఏర్పడతాయి. శరీర మెటబాలిజమ్‌లో మార్పులు, బలహీనత దీనికి కారణం

By Bolleddu Sarath Chandra
Nov 14, 2024

Hindustan Times
Telugu

సుదీర్ఘ కాలం డయాబెటిస్‌ ఉన్నవారిలో రక్తనాళాల్లో సమస్యలు,  హర్మోనులు, నరాలలో మార్పు వల్ల అంగస్థంభన సమస్యలు ఏర్పడతాయి.

డయాబెటిస్ రోగుల్లో సాధారణంగా కనిపించే సమస్యల్లో కామవాంఛ తగ్గిపోవడం, శీఘ్రస్కలనం, అంగ స్థంభనలో వైఫల్యం వంటి ఇబ్బందులు ఎదరవుతాయి. 

అంగ స్తంభనలో రెండు నిమిషాల కంటే ముందే వీర్యం స్కలించడాన్ని శీఘ్ర స్కలన సమస్యగా భావించాల్సి ఉంటుంది. 

డయాబెటిస్‌లో శీఘ్రస్కలన  సమస్యను  పరిష్కరించడానికి సైకోథెరపీ, మాస్టర్‌ జాన్సన్‌ టెక్నిక్,లోకల్ అనస్తీషియా,  జెల్‌, స్ప్రే వంటి పద్దతులుఉపయోగపడతాయి. 

మధుమేహ రోగుల్లో రక్తనాళాలు మూసుకుపోవడం, కుంచించుకుపోవడం వల్ల పారాసింపథిటిక్‌ నాళాలకు తగినంత రక్తం చేరకపోవడం వల్ల స్తంభన సమస్యలు ఏర్పడతాయి. 

మానసిక కారణాల వల్ల కూడా అంగస్థంభన సమస్యలు ఏర్పడవచ్చు. నిద్రలో ప్రాత:కాలంలో అంగస్థంభన జరుగుతుంది.  కొందరికి కొన్ని సమయాల్లో మాత్రమే ఈ సమస్య ఉంటుంది. డయాబెటిస్‌లో న్యూరోపతిక్ సమస్య ఉన్నవారిలో ఇది ఎక్కువగా ఉంటుంది. 

మూత్ర విసర్జన సమయంలో కొన్ని సెకన్ల పాటు  విసర్జన ఆపగలిగితే దానిని  మానసిక సమస్యగానే భావించాలి.

చలికాలంలో చియా సీడ్స్ తో ఇన్ని లాభాలా - వీటిని తెలుసుకోండి

image credit to unsplash