PEXELS
కళ్ల కింద నల్లటి వలయాలు రావడానికి ముఖ్య కారణం కంటికి సరిపడా నిద్రపోకపోవడమే. వీటిని తగ్గించడానికి రాత్రిపూట తప్పకుండా 7-9 గంటలు నిద్రపోయేలా చూసుకోండి.
PEXELS
అందంగా కనిపించాలన్నా, ఆరోగ్యంగా జీవించాలన్నా శరీరానికి సరిపడా నీరు కావాలి. కంటి కింద నల్లటి వలయాలు తగ్గడం కోసం హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. కనుక రోజంగా పుష్కలంగా నీరు త్రాగండి.
PEXELS
విటమిన్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు, సిట్రస్ పండ్లు తినడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ సమస్య నుంచి త్వరగా తప్పించుకోవచ్చు.
PEXELS
కంటి ఆరోగ్యాన్ని కాపోడుకోవడం కోసం యూవీ కిరణాల నుంచి తప్పించుకోవడం చాలా అసవరం. కంటి కింద నల్లటి వలయాలు రాకుండా ఉండాలంటే వీలైనంత వరకూ సన్ గ్లాసెస్, సన్ స్క్రీన్‌తో మీ చర్మాన్ని, కంటిని రక్షించుకోండి.
PEXELS
కళ్ళను తరచుగా రుద్దడం,నలపడం వంటివి కూడా కంటి అలెర్జీలకు కారణమై కంటి కింద నల్లటి వలయాలకు దారితీస్తాయి. ఈ అలవాటు మీకుంటే వెంటనే మానేయండి.
యోగా లేదా ధ్యానం వంటి విశ్రాంతి, ప్రశాంతత కలిగించే పనులు ద్వారా ఒత్తిడిని తగ్గించుకోండి. ఎందుకంటే ఒత్తిడి కారణంగా కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి.
PEXELS
కంటి కింద నల్లటి వలయాలను పోగొట్టుకోవడానికి, ఆరోగ్యకరమైన చర్మాన్ని పెంపొందించుకోవడానికి రాత్రి పడుకునే ముందు మేకప్ తొలగించడం చాలా అవసరం.
PEXELS