కంటి కింద నల్లటి వలయాలను సహజంగా పొగొట్టుకోవడం ఎలా?

PEXELS

By Ramya Sri Marka
Feb 15, 2025

Hindustan Times
Telugu

నిద్ర లేకపోవడం, జన్యుపరమైన సమస్యలు, వృద్ధాప్యం వంటి అనేక కారణాల వల్ల సంభవించినప్పటికీ కంటి కింద నల్లటి వలయాలు వ్యక్తి శారీరక సౌందర్యాన్ని, మానసికంగా ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రభావితం చేస్తాయి

PINTEREST

 విశ్రాంతి నిద్ర నుండి ఒత్తిడిని తగ్గించుకోవడం వరకు డార్క్ సర్కిల్స్‌ను సహజంగా పోగొట్టేందుకు సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ట్రై చేసి చూడండి.

PINTEREST

ప్రశాంతమైన నిద్ర పొందండి

కళ్ల కింద నల్లటి వలయాలు రావడానికి ముఖ్య కారణం కంటికి సరిపడా నిద్రపోకపోవడమే. వీటిని తగ్గించడానికి రాత్రిపూట తప్పకుండా 7-9 గంటలు నిద్రపోయేలా చూసుకోండి.

PEXELS

ఆర్ద్రీకరణ

అందంగా కనిపించాలన్నా, ఆరోగ్యంగా జీవించాలన్నా శరీరానికి సరిపడా నీరు కావాలి. కంటి కింద నల్లటి వలయాలు తగ్గడం కోసం హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. కనుక రోజంగా పుష్కలంగా నీరు త్రాగండి.

PEXELS

హెల్తీ డైట్

విటమిన్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు, సిట్రస్ పండ్లు తినడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ సమస్య నుంచి త్వరగా తప్పించుకోవచ్చు.

PEXELS

సన్ ప్రొటెక్షన్

కంటి ఆరోగ్యాన్ని కాపోడుకోవడం కోసం యూవీ కిరణాల నుంచి తప్పించుకోవడం చాలా అసవరం. కంటి కింద నల్లటి వలయాలు రాకుండా ఉండాలంటే వీలైనంత వరకూ సన్ గ్లాసెస్,  సన్ స్క్రీన్‌తో మీ చర్మాన్ని, కంటిని రక్షించుకోండి.

PEXELS

అలెర్జీలకు దూరంగా ఉండండి

కళ్ళను తరచుగా రుద్దడం,నలపడం వంటివి కూడా కంటి అలెర్జీలకు కారణమై కంటి కింద నల్లటి వలయాలకు దారితీస్తాయి. ఈ అలవాటు మీకుంటే వెంటనే మానేయండి.  

PINTEREST

ఒత్తిడిని నిర్వహించండి

యోగా లేదా ధ్యానం వంటి విశ్రాంతి, ప్రశాంతత కలిగించే పనులు ద్వారా ఒత్తిడిని తగ్గించుకోండి. ఎందుకంటే ఒత్తిడి కారణంగా కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. 

PEXELS

పడుకునే ముందు మేకప్ తొలగించేలా చూసుకోండి

కంటి కింద నల్లటి వలయాలను పోగొట్టుకోవడానికి, ఆరోగ్యకరమైన చర్మాన్ని పెంపొందించుకోవడానికి రాత్రి పడుకునే ముందు మేకప్ తొలగించడం చాలా అవసరం. 

PEXELS

వేసవిలో చెమట వాసన సమస్యా...? ఇలా వదిలించుకోండి

image credit to unsplash