ఇలా చేస్తే.. గ్యాస్ట్రిక్​ నొప్పి నుంచి తక్షణ ఉపశమనం!

pexels

By Sharath Chitturi
Jun 16, 2024

Hindustan Times
Telugu

ఆహారాన్ని వేగంగా తినడం, జంక్​ ఫుడ్​ అధికంగా తినడం, ఫైబర్​ తక్కువ ఉండే ఆహారాలు తీసుకోవడం వంటివి.. గ్యాస్​ సమస్యకు కారణాలు. వీటి నుంచి రిలీఫ్​ కోసం కొన్ని టిప్స్​ పాటించాలి.

pexels

హెర్బల్​ టీ తీసుకుంటే గ్యాస్​ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్​, యాంటీ- ఇన్​ఫ్లమేటర్​ పదార్థాలు కుడుపుకు మంచివి.

pexels

సోంపు గింజలు చాలా బాగా పనిచేస్తాయి. ఆయుర్వేదంలో గ్యాస్​ సమస్యకు ముఖ్యమైన పరిష్కారం ఇవే! కడుపు ఉబ్బరంగా ఉండటాన్ని తగ్గిస్తాయి.

pexels

గ్యాస్​ సమస్య వచ్చినప్పుడు లవంగం తింటే ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

pexels

గ్యాస్​ సమస్య కోసం కొందరు సోడా తాగుతారు. అయితే.. అతిగా సోడా తాగకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

pexels

ఫైబర్​ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తినొచ్చు. వాటితో సమస్యలు ఉండవు.

pexels

కొన్ని రోజుల పాటు జంక్​ ఫుడ్​కి దూరంగా ఉంటే కడుపుకు మంచిది. ఏం తిన్నా, నిదానంగా తినడాన్ని అలవాటు చేసుకోండి.

pexels

నిమ్మ-అల్లం టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Photo: Pexels