కిడ్నీ సమస్యలు ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
By Maheshwaram Mahendra Chary Jan 19, 2025
Hindustan Times Telugu
మీలో కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని బట్టి అప్రమత్తం కావొచ్చు.
image credit to unsplash
కిడ్నీ సమస్యలు ఉంటే రాత్రుళ్ళు ఎక్కువగా యూరిన్ వస్తుంది. ఈ విషయాన్ని మీకు మీరే గమనించుకోవాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించటం మంచిది.
image credit to unsplash
కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే రాత్రి పూట పాదాల వాపు కనిపిస్తుంది. సాధారణంగా మూత్రపిండాల వ్యాధుల వల్ల వచ్చే వాపు సాయంత్రం, రాత్రుళ్ళు ఎక్కువగా ఉంటుంది.
image credit to unsplash
కిడ్నీ సమస్యలు ఉన్నట్లు అయితే పదే పదే దురద వస్తుంది. అంతేకాకుండా స్కీన్ కూడా పొడిబారినట్లు కనిపిస్తుంది.
image credit to unsplash
కిడ్నీసమస్యలున్నప్పుడు రక్తంలో మలినాలు, వ్యర్థాలు పేరుకుపోతాయి. దీంతో అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్ సరిగా పని చేయవు.
image credit to unsplash
కిడ్నీ సమస్యలు ఉంటే వికారం, వాంతులు వస్తాయి. రక్తంలో వ్యర్థాలు పేరుకుపోవటం వల్ల వికారం సమస్య ఏర్పడుతుంది.
image credit to unsplash
కిడ్నీల సమస్యల ఉంటే బలహీనంగా మారిపోతారు. అలసటగా అనిపిస్తుంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.