క్యాన్సర్‌ను ఎలా గుర్తించవచ్చో తెలుసా..? ఈ 6 విషయాలు తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Mar 19, 2025

Hindustan Times
Telugu

క్యాన్సర్ అంటే చాలా మంది భయడిపోతారు. ఇది ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని భావిస్తుంటారు. అయితే ఈ రోగాన్ని కొన్ని ప్రాథమిక లక్షణాలతో గుర్తించవచ్చు.

image credit to unsplash

పాంక్రియాస్, లంగ్స్ తో పాటు శరీరం లోపల క్యాన్సర్ వచ్చినప్పుడు అతిగా బరువు తగ్గిపోతారు. వేగంగా బరువు తగ్గటం క్యాన్సర్ తొలి సంకేతంగా చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

image credit to unsplash

మలంతో పాటు మూత్రంలో ఉన్నట్టుండి తేడాలు కనిపిస్తాయి. మూత్రానికి వెళ్లేటప్పుడు నొప్పి రావడం లేదా రక్తం పడటం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే  బ్లాడర్ లేదా ప్రొస్టేట్ క్యాన్సర్లకు సంబంధించి ఉండొచ్చు.

image credit to unsplash

గొంతులో లేదా నాలుక భాగంలో ఏమైనా గడ్డలాంటివి ఏర్పడటం, నొప్పిగా ఉండటం వంటి సమస్యలు ఉంటే కూడా జాగ్రత్తగా ఉండాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి. గొంతులో ఎప్పుడూ గరగరగా ఉండటం కూడా క్యాన్సర్ లక్షణంగా భావించవచ్చు.

image credit to unsplash

శరీరంపై అయ్యే గాయాలు లేదా పుండ్లు మానకపోతే కూడా క్యాన్సర్ కు దారి తీస్తాయి. ముఖ్యంగా  నోటి భాగంలో ఏమైనా పుండ్లు అయినట్లు అనిపిస్తే... వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

image credit to unsplash

రొమ్ములు, వృషణాలతో పాటు మరికొన్ని భాగాల్లో గట్టిగా ఉండే ఏమైనా గడ్డలు ఏర్పడినట్లు ఉంటే అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే శరీర భాగం గట్టిగా మారిపోవడం క్యాన్సర్‌ను  గుర్తించే సంకేతాల్లో ఒకటిగా ఉంటుంది.

image credit to unsplash

కొన్నిసార్లు శరీరంపై ఉండే పుట్టు మచ్చలు, పులిపిర్ల రంగు మారడం, పరిమాణం పెరగడం వంటి మార్పులు కనిపిస్తుంటాయి. ఇలాంటి వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ఈ పరిణామాలు కూడా క్యాన్సర్ కారణాలకు సాంకేతకంగా చెబుతారు.

image credit to unsplash

ప్రొటీన్ సహజంగా అందించే కూరగాయలు

అధిక ప్రొటీన్ అందించే మీకు తెలియని ఆరు కూరగాయలు ఇవే

PINTEREST, EATING WELL