పిస్తాలను ఎలా తింటే ఎక్కువ ప్రయోజనాలు దక్కుతాయి?

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
May 12, 2024

Hindustan Times
Telugu

పిస్తా పప్పులో ఫైబర్, ప్రొటీన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బీ6 సహా చాలా పోషకాలు ఉంటాయి. అందుకే రోజూ దీన్ని తింటే శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. 

Photo: Pexels

జీర్ణక్రియ మెరుగుదల, శరీరానికి శక్తి, పోషకాలు, చర్మం ఆరోగ్యం సహా పిస్తాల వల్ల చాలా లాభాలు కలుగుతాయి. పిస్తాలను ఎలా తీసుకుంటే మెరుగ్గా పోషకాలు అందుతాయో ఇక్కడ తెలుసుకోండి. 

Photo: Pexels

పిస్తాలను నేరుగా తినడం కంటే.. నానబెట్టుకొని తింటే శరీరానికి మెరుగ్గా పోషకాలు దక్కుతాయి. నానబెట్టిన పిస్తాలతో పూర్తిస్థాయి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

Photo: Pexels

పిస్తాలపై పొట్టును తీసేసి రాత్రంతా నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని ఉదయం తింటే శరీరానికి పోషకాలు చాలా బాగా లభిస్తాయి. నానబెట్టి తింటే పిస్తాల పోషక విలువలు పెరిగి.. పూర్తి ప్రయోజనాలు దక్కుతాయి. రోజుకు 10 నుంచి 12 పిస్తా పప్పులు తినొచ్చు. 

Photo: Pexels

పిస్తాల్లో కాల్షియమ్ కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని రెగ్యులర్‌గా తింటే ఎముకల దృఢత్వానికి కూడా ఉపయోగపడతాయి. 

Photo: Pexels

బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ కంట్రోల్‍లో ఉండేందుకు కూడా పిస్తాలు సహకరిస్తాయి. ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. చర్మానికి కూడా మేలు జరుగుతుంది.

Photo: Pexels