రొమ్ము క్యాన్సర్‌ను  గుర్తించేదెలా...? 7 ముఖ్యమైన విషయాలు

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Mar 21, 2025

Hindustan Times
Telugu

క్యాన్సర్ లో అనేక రకాలు ఉంటాయి. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అయితే కొన్ని లక్షణాల ఆధారంగా వీటిని ప్రాథమికంగా గుర్తించే వీలు ఉంటుంది.

image credit to unsplash

రొమ్ములో ఏ కాస్త గట్టిగా అనిపించినా లేకా కణితిలాంటిది కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు.

image credit to unsplash

నిజానికి రొమ్ముల్లో కనిపించే గడ్డల్లో చాలా వరకు క్యాన్సర్‌ కు చెందినవి కావు. అయినప్పటికీ నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి.

image credit to unsplash

రొమ్ముల్లో అసాధారణమైన మార్పులు కనిపిస్తే కూడా క్యాన్సర్ కు సాంకేతంగా భావించవచ్చు. ఇలాంటి సమయంలో మామోగ్రామ్‌ టెస్ట్ ను చేయించుకోవాలి. దీని ద్వారా రొమ్ముల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుస్తాయి.

image credit to unsplash

 రొమ్ము చనుమొనలో మార్పులు కనిపిస్తాయి. అంతేకాకుండా స్రావాలు కూడా విడుదలవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యులను సంప్రదించాలి.

image credit to unsplash

 రొమ్ములో ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ ఉండే చర్మం లేత గులాబీ రంగులో లేదా కమిలిపోయినట్లుగా కనిపించవచ్చు. ఇలాంటి వాటిని ముందుగానే గమనించి... పరీక్షలు చేయించుకోవాలి.

image credit to unsplash

రొమ్ము క్యాన్సర్ ను అంత తొందరగా గుర్తించలేం. కాబట్టి ఏ చిన్న తేడా అనిపించినా... వైద్యులను సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నడి వయసు దాటే మహిళలు మరికొంత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

image credit to unsplash

తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ - మే తొలివారంలో మళ్లీ వర్షాలు..!

image credit to unsplash