మనం ఏదో ఒక సందర్భంలో అధిక భావోద్వేగాలతో పోరాడాల్సి ఉంటుంది. ఇది కష్టమైనప్పటికీ ఈ 9 చిట్కాలతో భావోద్వేగ పరిస్థితులను అధిగమించవచ్చు.
pexels
By Bandaru Satyaprasad Sep 11, 2024
Hindustan Times Telugu
డీప్ బ్రీత్ - భావోద్వేగాలు తీవ్రంగా అనిపించినప్పుడు నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోండి. ఇలా కాసేపు చేయడం వల్ల మీ నాడీ వ్యవస్థను శాంతింపజేయవచ్చు. దీంతో మీరు నియంత్రణలో ఉంటారు.
pexels
పనుల విభజన - మీ పనులను విభజించుకోండి. ఒక సమయంలో ఒక పనిని ఎంచుకోండి. పెద్ద టాస్క్ లను చిన్న చిన్న దశలుగా విడగొట్టడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
pexels
నో చెప్పడం - కొన్నిసార్లు నో చెప్పడం ముఖ్యం. మీ సమయాన్ని, శక్తిని రక్షించుకోవడానికి ఇతరులతో స్పష్టమైన సరిహద్దులను సెట్ చేసుకోండి. ఇది ఎమోషనల్ బర్న్ అవుట్ ను నివారించడానికి సహాయపడుతుంది.
pexels
మల్టీ టాస్కింగ్ వద్దు - ఒకేసారి ఎక్కువ పనులు చేయడం మానుకోండి. మల్టీ టాస్కింగ్ వల్ల మీపై ఒత్తిడి పెరుగుతుంది. మీ ప్రొడక్టివిటీని పెంచడానికి, భావోద్వేగ ఒత్తిడిని తగ్గించి పనిపై దృష్టి పెట్టడానికి మల్టీ టాస్కింగ్ ను నివారించండి.
pexels
రిలాక్సింగ్ టెక్నిక్స్ - డీప్ బ్రీతింగ్, మెడిటేషన్, యోగా సాధన మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ టెక్నిక్స్ మీ ఒత్తిడిని తగ్గించి ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకుని శక్తిని ఇస్తాయి.
pexels
ఫిజికల్ యాక్టివిటీ - మీ భావోద్వేగాలను తగ్గించేందుకు ఫిజికల్ యాక్టివిటీ మంచి టెక్నిక్. నడవడం, వర్కవుట్, స్ట్రెచ్చింగ్ వంటివి మీ మైండ్ ను భావోద్వేగ ఆలోచనల నుంచి మళ్లించి మూడ్ ను మారుస్తాయి.
భావోద్వేగాలను రిలీజ్ చేయడానికి జర్నలింగ్ గొప్ప మార్గం. మీ ఆలోచనలను రాయడం వల్ల మీరు ఆ విషయాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. తక్కువ ఒత్తిడికి గురవుతారు.
పక్కవారితో మాట్లాడడం - స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడం, మీ భావాలను పంచుకోవడం చాలా ఓదార్పునిస్తుంది. మీ భావోద్వేగాలను వ్యక్తపరిస్తే ఒత్తిడిని తగ్గిస్తుంది.
pexels
ఒక్కోసారి అతిగా అనిపించినా పర్వాలేదు మీతో మీరు సున్నితంగా ఉండండి. మీ భావాలను గుర్తించి, వాటిని ప్రాసెస్ చేయడానికి కొంత సమయం కేటాయించుకోండి.
సీతాఫలం పోషకాహార పవర్‌హౌస్. వీటిలో ఫైబర్, మినరల్స్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. సీతాఫలంలో పీచుపదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. సీతాఫలం వల్ల కలిగే10 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.