అధిక మంట కోసం గ్యాస్ బర్నర్ ను ఎలా శుభ్రం చేసుకోవాలి? ఈ టిప్స్ ఫాలో అవ్వండి   

twitter

By Bandaru Satyaprasad
Mar 18, 2025

Hindustan Times
Telugu

మీ గ్యాస్ బర్నర్ నుంచి మంట తక్కువగా వస్తుందా? అయితే ఇలా శుభ్రం చేసుకుంటే గ్యాస్ వృధా కాకుండా అధిక మంట వస్తుంది.   

twitter

మీ గ్యాస్ స్టవ్ బర్నర్ లో సమస్య కారణంగా తక్కువ మంట వస్తుంటుంది. దీని వల్ల గ్యాస్ వృధా, ఆహార పదార్థాలు ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ టిప్స్ పాటిస్తే మీరు గ్యాస్ బర్నర్ ను సమర్థవంతంగా క్లీన్ చేసుకోవచ్చు.   

twitter

 బర్నర్ ను చల్లబరచండి- బర్నర్ ను శుభ్రం చేసే ముందు, గ్యాస్ సరఫరాను ఆపివేయండి. దీంతో బర్నర్ కూల్ అవుతుంది. 

twitter

బర్నర్ క్యాప్ లను సబ్బులో నానబెట్టండి - నీరు, సబ్బు కలిపి ద్రవ మిశ్రమాన్ని తయారుచేయండి. బర్నర్ మూతలను ఆ మిశ్రమంలో 30 నిమిషాలు నానబెట్టండి.  

twitter

బర్నర్లను స్ర్కబ్ చేయండి - బర్నర్లపై ఏదైనా గ్రీజు మిగిలి ఉంటే బేకింగ్ సోడా పేస్ట్ ఉపయోగించి వాటిని స్క్రబ్ చేయండి.   

twitter

సూదితో రంధ్రాలను శుభ్రం చేయండి - బర్నర్ హెడ్స్ పై ఉన్న చిన్న రంధ్రాలను సూది లేదా పిన్నులతో శుభ్రం చేయండి. లేదా పాత బ్రష్ తో క్లీన్ చేసుకోవచ్చు.  

twitter

శుభ్రం చేసి ఆరబెట్టండి - సబ్బు అవశేషాలను తొలగించడానికి బర్నర్ లను నీటితో శుభ్రం చేయండి. గ్యాస్ సరఫరాను ఆన్ చేసే ముందు వాటిని ఆరనివ్వండి.  

twitter

తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ - మే తొలివారంలో మళ్లీ వర్షాలు..!

image credit to unsplash