ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ అమలు చేస్తుంది. ఇందుకోసం 9552300009 మన మిత్ర (వాట్సాప్ నెంబర్)ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సాప్ నెంబర్ తో ఏపీఎస్ఆర్టీసీ టికెట్లు బుకింగ్ లేదా రద్దు చేసుకోవచ్చు.    

HT Telugu

By Bandaru Satyaprasad
Feb 01, 2025

Hindustan Times
Telugu

మీ వాట్సాప్ లో ఏపీ ప్రభుత్వం నెంబర్ 9552300009 సేవ్ చేసుకోండి. అనంతరం వాట్సాప్ లో ప్రభుత్వ నెంబర్ కు 'Hi' అని మెసేజ్ పెట్టండి.  

HT Telugu

మన మిత్ర పౌర సహాయక సేవకు స్వాగతం..అంటూ ఓ మెసేజ్ వస్తుంది. అందులో 'సేవను ఎంచుకోండి' ఆప్షన్ పై క్లిక్ చేసి 'APSRTC సేవలు' పై క్లిక్ చేయండి.   

HT Telugu

బస్ టికెట్ బుకింగ్ లేదా బస్ టికెట్ రద్దు ఆప్షన్లు కనిపిస్తాయి. టికెట్ బుకింగ్ పై క్లిక్ చేయండి.   

HT Telugu

మీ ప్రయాణం ప్రారంభం, గమ్యస్థానం ఎంచుకోండి. ఆ తర్వాత మీ ప్రయాణ తేదీని సెలక్ట్ చేయండి.   

HT Telugu

 ఏసీ, నాన్ ఏసీ, ఆల్ లో మీరు ప్రయాణించే బస్ రకాన్ని ఎంచుకోండి. దీంతో అందుబాటులో ఉన్న బస్సుల వివరాలు టైమింగ్ తో సహా డిస్ ప్లే అవుతాయి. 

HT Telugu

మీరు బస్ ఎక్కే ప్రాంతం, దిగే ప్రదేశం ఎంచుకోండి. అనంతరం సీట్లను ఎంచుకుని ప్రయాణికుల వివరాలు నమోదు చేయాలి.  

HT Telugu

 చివరిగా చెల్లింపును పూర్తి చేయాలి. యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ చెల్లింపు పూర్తి చేయవచ్చు. 

pexels

 ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్లు బుక్ అయిన వెంటనే.. టికెట్ వివరాలు వాట్సాప్ నెంబర్ కు లేదా ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు. ప్రయాణ సమయంలో ఈ వివరాలు డ్రైవర్ కు చూపవచ్చు.  

HT Telugu

ఒక్క లైన్​తో జీవిత పాఠాలు నేర్పించిన తెలుగు సినిమా డైలాగ్​లు ఇవి..