కృత్రిమ  గర్భ నిరోధక పద్ధతులు ఎంత వరకు సురక్షితం?

By Sarath Chandra.B
Apr 15, 2025

Hindustan Times
Telugu

కృత్రిమ గర్భ  నిరోధక పద్ధతుల్లో  తాత్కలిక పద్ధతులు, శాశ్వత గర్భ నిరోధక పద్ధతులు ఉంటాయి. 

తాత్కలిక గర్భ నిరోధక పద్ధతుల్లో  నోటి మాత్రలు, ఇంజక్షన్‌లు, క్రీమ్ జెల్లీ, డయాఫ్రమ్‌, కాపర్ టి, నిరోధ్‌ ఉంటాయి.

నోటితో తీసుకునే గర్భ నిరోధక మాత్రలతో  రెండు నుంచి నాలుగేళ్ల వరకు గర్భం రాకుండా జాగ్రత్త పడొచ్చు. వైద్యుల పర్యవేక్షణలో 8ఏళ్ల వరకు ఈ మందులు వాడొచ్చు. 

గర్భ నిరోధక మాత్రల్లో 28 మాత్రలు ఉంటాయి.  వీటిలో 21 తెలుపులో మిగిలినవి ముదురు  ఎరుపులో ఉంటాయి. 

తెలుపు రంగు మాత్రలు హార్మోన్‌లను నియంత్రిస్తాయి. వీటిని రుతుక్రమం మొదలైన ఐదో రోజు నుంచి 21వ రోజు వరకు వాడాలి. 

గర్భ నిరోధక మాత్రలను ప్రతిరోజు ఒకే సమయంలో వాడటం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. 

ఎప్పుడైనా టాబ్లెట్‌ వేసుకోవడం మర్చిపోతే తర్వాత రోజు రెండు టాబ్లెట్స్‌ వేసుకోవాల్సి ఉంటుంది. 

గర్భ నిరోధక మందుల్ని వాడే వారికి ఉదయాన్నే వికారం, రొమ్ము వాపు, గర్భం దాల్చినపుడు ఉండే లక్షణాలు ఉంటాయి. 

గర్భం వచ్చినపుడు స్త్రీ శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోనులు గర్భ నిరోధక మాత్రల్లో కూడా ఉంటాయి. 

కాళ్ల నొప్పులు, లివర్ ఇన్‌ఫెక్షన్‌, క్యాన్సర్, పార్శ్వ నొప్పులు, పిల్లలకు పాలిస్తున్న తల్లులు ఈ మందులు వాడకూడదు. 

ఉబ్బసం, ఆయాసం, డయాబెటిస్‌,  మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌, కాళ్ల వాపు, బహిష్టులో ఎక్కువ రక్త స్రావం అయ్యే వారు వైద్యుల సలహాపై ఈ మందులు వాడాలి.

గర్భ నిరోధక మందులు వాడితే చికాకు, నిరాశగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

గర్భ నిరోధక మాత్రలు ఎక్కువ కాలం వాడితే ఈస్ట్రోజెన్ హార్మోన్ జీర్ణాశయ పొరలను పాడు చేయొచ్చు.  రక్తం గడ్డ కట్టే సమస్య, గుండె జబ్బులు, క్యాన్సర్, రక్త పోటు, మధుమేహం వంటి సమస్యలు తలెత్తుతాయి. 

నెట్‍ఫ్లిక్స్‌లో ఈనెల వచ్చిన టాప్-5 సినిమాలు