పనీర్ తినేందుకు రుచికరంగా ఉంటుంది. అందుకే దీన్ని చాలా మంది ఇష్టపడతారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు పన్నీర్ తినొచ్చా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.
Photo: Pexels
పనీర్‌లో ప్రోటీన్, విటమిన్ బీ, కాల్షియం సహా మరిన్ని పోషకాలు మెండుగా ఉంటాయి. బరువు తగ్గేందుకు పనీర్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇక్కడ చూడండి.
Photo: Pexels
బరువు తగ్గాలనుకునే వారికి పనీర్ చాలా తోడ్పడుతుంది. పనీర్‌లో ఉండే ప్రోటీన్ వల్ల ఇది తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువ సేపు ఉంటుంది. ఇతర ఆహారాలు ఎక్కువగా తినకుండా ఇది చేయగలదు. ఆకలిని తగ్గిస్తుంది.
Photo: Pexels
100 గ్రాముల పనీర్‌లో సుమారు 18 నుంచి 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మజిల్ లాస్ అవకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది. కండలు పెరిగేందుకు సహకరిస్తుంది. ప్రోటీన్ వల్ల శరీరంలో జీవక్రియ మెరుగై క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. దీంతో వెయిట్ లాస్‍కు తోడ్పడుతుంది.
Photo: Pexels
పనీర్‌లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలకునే వారు దీన్ని తినొచ్చు. పనీర్ తింటే క్యాలరీ ఇన్‍టేక్ తగ్గి శరీరానికి మంచి పోషకాలు అందుతాయి.
Photo: Pexels
పనీర్‌లో కాల్షియం కూడా మెండుగా ఉంటుంది. దీనివల్ల ఎముకల దృఢత్వానికి మేలు జరుగుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు కూడా ఇది తోడ్పడుతుంది.
Photo: Pexels
బరువు తగ్గాలనుకునే వారు ప్రతీ రోజు 100 నుంచి 150 గ్రాముల వరకు పనీర్ తినొచ్చు. మోతాదు మేరకు తింటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రయోజనాలు మెండుగా ఉంటాయి.
Photo: Pexels
బరువు తగ్గేందుకు డైట్, వర్కౌట్లతో పాటు ఇవి కూడా ముఖ్యమే!