ఓ రోజులో పుచ్చకాయ ఎంత తినొచ్చు!

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Mar 20, 2025

Hindustan Times
Telugu

వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అందుకే ప్రతీ రోజు ఈ పండును తినడం ఎంతో మేలు. చల్లదనం నుంచి గుండె ఆరోగ్యం వరకు పుచ్చకాయతో ఎన్నో లాభాలు ఉంటాయి.  

Photo: Pexels

అయితే, పుచ్చకాయను మరీ అతిగా తింటే కడుపులో కాస్త ఇబ్బందిగా అనిపించటంతో పాటు విరేచనాల రిస్క్ కూడా ఉంటుంది. దీంతో ఓ రోజులో పుచ్చకాయ ఎంత తినొచ్చోనని కొందరికి సందేహం ఉంటుంది. ఆ ఆన్సర్ ఇక్కడ చూడండి. 

Photo: Pexels

ఓ రోజులో 300 గ్రాముల నుంచి 350 గ్రాముల పుచ్చకాయను తినొచ్చు. ఈ మోతాదు మేరకు తింటే పుచ్చకాయతో వేసవిలో శరీరానికి చాలా లాభాలు కలుగుతాయి. 

Photo: Pexels

ఎండాకాలంలో పుచ్చకాయ ప్రతీరోజు తినడం వల్ల శరీరానికి హైడ్రేషన్ మెరుగ్గా అందుతుంది. ఈ పండులో నీరు 92శాతం ఉంటుంది. దీంతో డీహైడ్రేషన్ అవకుండా ఈ పండు చేయగలదు. శరీరంలో నీటి శాతాన్ని, చల్లదనాన్ని పెంచుతుంది. 

Photo: Pexels

పుచ్చకాయలో విటమిన్ ఏ, విటమిన్ బీ6, విటమిన్ సీ, పొటాషియం, మెగ్నిషియం సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. ఈ పండు తింటే ఈ పోషకాలు శరీరానికి మెరుగ్గా అంది ప్రయోజనాలు చేకూరుతాయి. లాభాలు ఉంటాయి.  

Photo: Pexels

పుచ్చకాయ తినడం వల్ల జీర్ణక్రియకు, పేగుల కదలికకు మేలు జరుగుతుంది. ఇందులో ఉండే పుష్కలమైన ఫైబర్ వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది. అందుకే పుచ్చకాయను ఎండాకాలంలో ప్రతీ రోజూ తినాలి. 

Photo: Pexels

చర్మానికి, జుట్టుకు కూడా పుచ్చకాయ మేలు చేస్తుంది. ఈ పండులోని పొటాషియం, ఎమినో యాసిడ్లు బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

Photo: Pexels

సరిగ్గా నిద్ర పోవడం లేదా? ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త