గుండె జబ్బులకు కొవ్వులు ఎంత వరకు కారణం....ఆ ప్రచారంలో నిజం ఎంత?

By Bolleddu Sarath Chandra
Feb 06, 2025

Hindustan Times
Telugu

పోషకాహార నిపుణులు, డైటిషియన్లు, వైద్యులు రాసే వ్యాసాల్లో  ఆహారంలో కొవ్వు పదార్ధాలు తక్కువగా ఉండేలా చూసుకోమని సూచించడానికి కారణం 50వ దశకంలో అమెరికాలో విస్తరించిన గుండె జబ్బులు కారణం...

గుండె జబ్బులకు మూల కారణం కొవ్వు పదార్ధాలనే సిద్ధాంతం మొదట అమెరికాలోనే మొదలైంది...

గుండె జబ్బులకు, ఆహారంలో కొవ్వు పదార్ధాలే కారణం అనడానిిక  ఖచ్చితమైన రుజువులు ఇప్పటి వరకు దొరకలేదు. 

గుండె జబ్బులకు కొవ్వు పదార్ధాల కంటే రిఫైన్డ్‌ ఆయిల్స్‌, ఫాస్ట్‌ ఫుడ్, కూల్ డ్రింక్స్‌, హెల్త్‌ డ్రింక్స్‌  ఎక్కువ కారణం చూపుతాయి. 

ఆహారంలో కొవ్వు పదార్ధాలు తగ్గితే  ఆ మేరకు పిండి పదార్ధాలను వినియోగించడం పెరుగుతుంది. 

పిండి పదార్ధాల విక్రయాలు మార్కెట్‌లోవివిధ రకాల ఉత్పత్తుల విక్రయాలు, వాటి వ్యాపారాలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా పిండి పదార్ధాల కంటే ఎక్కువగా కొవ్వులు గుండెకు చేటు చేస్తాయనే ప్రచారం జరిగిందని చెబుతున్నారు. 

అమెరికాలో మొదలైన కొవ్వు పదార్ధాల వ్యతిరేక సిద్ధాంతాన్నే ఇప్పటికి ప్రపంచం మొత్తం అనుసరిస్తోంది. ఆహారంలో రిఫైండ్‌ ఆయిల్స్‌ వినియోగం భాగమైనా గుండె జబ్బులు ఎందుకొస్తున్నాయనే స్పష్టత కొరవడింది. 

పిండి పదార్ధాల వినియోగం అధికం కావడంతో  ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి మెటబాలిక్‌  జబ్బులు అన్ని దేశాల్లో ప్రమాదకర స్థాయికి చేరాయి. 

ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశాల్లో శుద్ది చేసిన  ధాన్యాలు, పిండి పదార్ధాలు, పిండితో తయారు చేసిన బ్రెడ్‌లు, బన్‌లు, కేక్‌లు, బిస్కెట్స్, స్నాక్స్‌, పంచదార, కార్న్‌ సిరప్‌, కూల్‌ డ్రింక్స్‌ అధికంగా వినియోగించే చోట గుండె జబ్బులు ఎక్కువగా ఉంటున్నాయి. 

కొవ్వులతో కూడిన ఆహారంతో  కొలెస్ట్రాల్ ‌కు, ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులకు కారణం కాదని తాజా పరిశోధనలు రుజువు చేశాయి. 

శరీరంలో కాలేయమే 80 శాతం కొలెస్ట్రాల్ ఉత్పత్తి  చేసుకుంటోంది. పిండి పదార్ధాలను కనిష్ట స్థాయికి చేర్చి కొవ్వు పదార్ధాలను 60-70శాతం, ప్రొటీన్లను తగినంతగా ఆహారంలో తీసుకుంటే గుండె జబ్బులు దరి చేరవు.

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest