తలనొప్పి ఎన్ని రకాలుగా ఉంటుంది.. ఎందుకు వస్తుంది.. ఇక్కడ తెలుసుకోండి!

Image Source From unsplash

By Basani Shiva Kumar
May 19, 2025

Hindustan Times
Telugu

టెన్షన్ తలనొప్పి.. ఇది చాలా సాధారణమైంది. తల చుట్టూ బిగుతుగా లేదా ఒత్తిడి ఉన్నట్లు అనిపిస్తుంది. మెడ, భుజాలలో కూడా నొప్పి ఉండవచ్చు.

Image Source From unsplash

మైగ్రేన్.. ఇది తీవ్రమైన, తరచుగా ఒకవైపు వచ్చే తలనొప్పి. దీనితో పాటు వికారం, వాంతులు వస్తాయి. ఇది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది.

Image Source From unsplash

క్లస్టర్ తలనొప్పి.. ఇది చాలా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. సాధారణంగా ఒక కన్ను చుట్టూ లేదా వెనుక వస్తుంది. కన్ను ఎర్రబడటం, నీరు కారడం, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

Image Source From unsplash

సైనస్ తలనొప్పి..  సైనస్‌లలో ఒత్తిడి పెరగడం వల్ల ఇది వస్తుంది. ముఖం, నుదురు, కళ్ల వెనుక నొప్పిగా అనిపిస్తుంది. ముక్కు దిబ్బడ లేదా చీమిడి కారడం వంటి సైనస్ లక్షణాలు కూడా ఉంటాయి.

Image Source From unsplash

సెర్వికోజెనిక్ తలనొప్పి.. మెడ సమస్యల వల్ల ఇది వస్తుంది. నొప్పి సాధారణంగా మెడ నుండి ప్రారంభమై తలకు వ్యాపిస్తుంది.

Image Source From unsplash

హార్మోన్ల తలనొప్పి.. మహిళల్లో హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే తలనొప్పి ఇది. ఉదాహరణకు రుతుక్రమం సమయంలో వస్తుంది.

Image Source From unsplash

కెఫీన్ తలనొప్పి.. ఎక్కువ కెఫీన్ తీసుకోవడం లేదా అకస్మాత్తుగా మానేయడం వల్ల వచ్చే తలనొప్పి ఇది.

Image Source From unsplash

డీహైడ్రేషన్ తలనొప్పి.. తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ తలనొప్పి వస్తుంది.

Image Source From unsplash

వాకింగ్ చేస్తున్నారా?.. నడిచేటప్పుడు ఈ తప్పులు చేయకండి..

Image Credits : Adobe Stock