కాకరకాయలు రుచికి చేదుగా ఉన్నా ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. దీంట్లో చాలా పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి.
Photo: Unsplash
అయితే, వారంలో కాకరకాయ జ్యూస్ ఎన్నిసార్లు తాగాలనే సందేహం చాలా మందిలో ఉంటుంది.
Photo: Unsplash
కాకరకాయ జ్యూస్‍ను వారంలో రెండురోజులు తాగితే మేలు. ఇలా వారానికి రెండుసార్లు తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి.
Photo: Unsplash
కాకరకాయలో ఫైబర్, విటమిన్ సీ, విటమిన్ ఏ, ఫోలెట్, పొటాషియమ్, కాల్షియమ్, జింక్ సహా చాలా పోషకాలు ఉంటాయి. అందుకే కాకరకాయ తినడం, దీని జ్యూస్ తాగడం ఎంతో మేలు చేస్తుంది.
Photo: Unsplash
డయాబెటిస్ ఉన్న వారికి కాకరకాయ జ్యూస్ ఔషధం లాంటిది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్‍లను కంట్రోల్ చేసేందుకు తోడ్పడుతుంది.
Photo: Unsplash
కాకరకాయ తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఉన్న కారణంగా రక్తం శుద్ధిగా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను కూడా ఇది మెరుగుపరుస్తుంది.