క్యాన్సర్ రకాలు, దశలెన్ని....? ఈ 6 విషయాలు తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Mar 27, 2025

Hindustan Times
Telugu

మారిన జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్ల వల్ల ఫురుషులు, మహిళలు అనే లింగభేధం లేకుండా ప్రస్తుతం చాలా మంది అనేక రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు. ఇందులో అనేక రకాలు ఉంటాయి.

image credit to unsplash

క్యాన్సర్‌ ప్రారంభమయ్యే రకాన్ని బట్టి వివిధ రకాలుగా వర్గీకరించారు. ఇందులో కార్సినోమా , సార్కోమా ,లుకేమియా ,లింఫోమా, బ్రెయిన్ వంటి క్యాన్సర్లు ఉన్నాయి.

image credit to unsplash

క్యాన్సర్‌లలో కార్సినోమాలు అత్యంత సాధారణ రకం. ఈ క్యాన్సర్ చర్మంలో లేదా శరీరం లోపలి అవయవాలని కప్పి ఉంచే కణజాలంలో ప్రారంభమవుతుంది. 

image credit to unsplash

ఇక సార్కోమా చూస్తే... ఎముక, మృదులాస్థి, కొవ్వు, కండరాలు లేదా రక్త నాళాలలో  ప్రారంభమయ్యే క్యాన్సర్ ను సార్కోమా అంటారు.

image credit to unsplash

లుకేమియా చూస్తే ఇది తెల్ల రక్త కణాలలో ఏర్పడే క్యాన్సర్ రకం. ఇది ఎముక మజ్జలో (బోన్ మ్యారో) రక్త కణాలను తయారు చేసే కణజాలంలో వస్తుంది. లింఫోమా రకం క్యాన్సర్‌లు రోగనిరోధక వ్యవస్థ కణాల్లోప్రారంభమవుతాయి.

image credit to unsplash

ఇక క్యాన్సర్లలోని దశలు చూస్తే 4 వరకు ఉంటాయి. కణితి స్థానంతో పాటు పరిమాణం బట్టి  దశ-1, దశ-2, దశ-3, దశ-4లుగా వర్గీకరిస్తారు.

image credit to unsplash

దశను బట్టి క్యాన్సర్ తీవ్రతను గుర్తిస్తారు. వాటికి అనుగుణంగా... సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ వంటి చికిత్సలను అందిస్తారు.

image credit to unsplash

సరిగ్గా నిద్ర పోవడం లేదా? ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త