రోజులో ఎన్ని ఎండు ద్రాక్షలు తినొచ్చు? ఎలా తింటే బెస్ట్

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Jul 13, 2024

Hindustan Times
Telugu

ఎండు ద్రాక్షలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు సహా చాలా పోషకాలు ఉంటాయి. అందుకే వీటిని ప్రతీ రోజు తింటే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. 

Photo: Pexels

అయితే, ఎండు ద్రాక్షల్లో వేడి చేసే గుణం ఉంటుంది. అందుకే మరీ ఎక్కువగా కూడా తినకూడదు. అందుకే రోజులో ఎన్ని తింటే మేలు అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి. 

Photo: Pexels

ప్రతీ రోజు 40 నుంచి 60 గ్రాముల ఎండు ద్రాక్షలను తినొచ్చు. అంటే సుమారు రోజుకు 10 నుంచి 14 ఎండు ద్రాక్షలను తినొచ్చు. 

Photo: Pexels

ఎండు ద్రాక్షలను నానబెట్టుకొని తింటే పోషకాలు మరింత మెరుగ్గా అందుతాయి. రాత్రంతా నీళ్లలో కానీ, పాలలో కానీ నానబెట్టుకొని ఉదయాన్ని వీటిని తింటే మరింత మేలు జరుగుతుంది. 

Photo: Pexels

నానబెట్టిన ఎండు ద్రాక్షలను తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. శరీరంలో రక్తం పెరిగేందుకు కూడా తోడ్పడతాయి. 

Photo: Pexels

ఎండుద్రాక్షలను డైలీ తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. ఎముకల దృఢత్వం, గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. 

Photo: Pexels

ఎముకలను బలంగా ఉంచుకునేందుకు మంచి ఆహారాలు తీసుకోవాలి. బలమైన ఎముకల కోసం అనేక ఆహార మార్పులు ఉన్నాయి.

Unsplash