కొలెస్ట్రాల్ తగ్గేందుకు పచ్చి వెల్లుల్లి.. రోజులో ఎంత తీసుకోవచ్చు!

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Feb 07, 2025

Hindustan Times
Telugu

వెల్లుల్లిలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గేందుకు కూడా వెల్లుల్లి సహకరిస్తుంది. 

Photo: Pexels

చెడు కొవ్వుగా పరిగణించే ఎల్‍డీఎల్ కొలెస్ట్రాల్ సుమారు 15 శాతం వరకు తగ్గేలా పచ్చి వెల్లుల్లిలోని కారకాలు చేయగలవని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. గుండె ఆరోగ్యానికి కూడా వెల్లుల్లి మేలు చేయగలవు. 

Photo: Pexels

కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా వెల్లుల్లిలోని అలీసిన్ అనే కారకం తోడ్పడుతుంది. అందుకే లివర్‌ పనితీరుకు కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. 

Photo: Pexels

రోజులో ఒకటి లేకపోతే రెండు వెలుల్లి రెబ్బలను (4 నుంచి 6 గ్రాములు) పచ్చిగా తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఉపకరిస్తాయి. 

Photo: Pexels

పచ్చి వెల్లుల్లి రెబ్బలను మోతాదు మేరకు తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ నియంత్రణలో ఉండేందుకు సహకరిస్తాయి.  శరీరంలో ఎనర్జీని కూడా పెంచగలవు.

Photo: Pexels

పచ్చి వెల్లుల్లి తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా మెరుగవుతుంది. యాంటీఆక్సిడెంటు గుణాలు ఉండడం వల్ల కణాల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. 

Photo: Pexels

పచ్చి వెలుల్లి తీసుకోవడం వల్ల ఎముకల దృఢత్వం కూడా మెరుగయ్యేందుకు తోడ్పడుతుంది. మెదడు చురుకుదనాన్ని కూడా పెంచగదు. 

Photo: Pexels

పురుషులలో వంధ్యత్వం అంటే ఏమిటి, వంధ్యత్వానికి కారణాలేమటి?