వేసవిలో రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చు?

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Apr 13, 2024

Hindustan Times
Telugu

కోడిగుడ్లలో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే, గుడ్లు శరీరానికి వేడి చేస్తాయి కాబట్టి వేసవిలో వీటిని తినొచ్చా.. తింటే రోజుకు ఎన్నితినొచ్చనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. 

Photo: Pexels

కోడిగుడ్లలో విటమిన్-ఏ, సీ, బీ5, బీ12, బీ2, ఫొలెట్, పాస్పరస్ కాల్షియమ్, ఐరన్, సహా చాలా పోషకాలు ఉంటాయి. 

Photo: Pexels

వేసవి కాలంలో కూడా ప్రతీ రోజు గుడ్లు తొనొచ్చు. అయితే, పరిమితి మేరనే తీసుకోవాలి. వేసవిలో ప్రతీ రోజు గరిష్ఠంగా 2 గుడ్ల వరకు తింటే మంచిది. 

Photo: Pexels

వేసవిలో మరీ ఎక్కువగా కోడిగుడ్లను తీసుకుంటే సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే రోజులో 2 గుడ్ల వరకు తింటే మేలు. 

Photo: Pexels

కోడిగుడ్ల వల్ల చాలా లాభాలు ఉంటాయి. శరీరానికి శక్తి దక్కడం, ఎముకల దృఢత్వం, రక్తం పెరుగుదల సహా చాలా ప్రయోజనాలు దక్కుతాయి. 

Photo: Pexels

కోడిగుడ్లలో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కూడా వీటిని తినాలి. ఓవరాల్ ఆరోగ్యానికి కోడిగుడ్లు రెగ్యులర్‌గా గుడ్లు తినడం చాలా ముఖ్యం. 

Photo: Pexels

భారతీయ వంటలలో చింతపండుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

Unsplash