డయాబెటిస్ ఉన్న వారు రోజులో ఎన్ని ఖర్జూరాలు తినొచ్చు?

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jan 22, 2025

Hindustan Times
Telugu

ఖర్జూరాల్లో ప్రోటీన్, ఐరన్, విటమిన్ బీ6, పొటాషియం, మెగ్నిషియం సహా మరిన్ని ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అందుకే ఇవి తింటే శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే, డయాబెటిస్ ఉన్న వారు మాత్రం ఖర్జూరాల విషయంలో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 

Photo: Pexels

డయాబెటిస్ ఉన్న వారు కూడా ఖర్జూరాలు తినొచ్చు. కానీ తప్పనిసరిగా మోతాదు పాటించాలి. రోజులో రెండు లేకపోతే మూడు మాత్రమే తినాలి. 

Photo: Pexels

ఖర్జూరాల్లో షుగర్ కంటెంట్ దాదాపు 70 శాతం ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్న వారు మోతాదును మించి తింటే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యే రిస్క్ ఉంటుంది. 

Photo: Pexels

ఖర్జూరాల్లో గ్లెసెమిక్ ఇండెక్స్ కూడా 42 నుంచి 72 మధ్య ఉంటుంది. ఇది కూడా షుగర్ ఉన్న వారికి మంచిది కాదు.

Photo: Pexels

ఖర్జూరాలు తినడంపై ఏవైనా సందేహాలు ఉంటే వారి షుగర్ స్థాయిని బట్టి సంబంధిత డాక్టర్ సలహా తీసుకోవచ్చు. మొత్తంగా డయాబెటిస్ ఉన్న వారు ఉన్న వారు రోజులో మూడు కంటే ఎక్కువ ఖర్జూరాలను తినకపోవడమే మంచిది. 

Photo: Pexels

మోతాదు మేరకు తింటే డయాబెటిస్ ఉన్న వారికి ఖర్జూరాలు మేలు చేస్తాయి. ఇందులోని ఫైబర్.. షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేలా చేయగలవు. బీపీ కంట్రోల్‍లో ఉండేందుకు పొటాషియం ఉపకరిస్తుంది.

Photo: Pexels

జీర్ణక్రియను కూడా ఖర్జూరాలు మెరుగుపరచగలవు. యాంటీఆక్సిడెంట్లు కణాల డ్యామేజ్‍ను తగ్గిస్తాయి. ఎముకల దృఢత్వానికి కూడా తోడ్పడతాయి.

Photo: Unsplash

రాత్రిపూట మటన్ తింటున్నారా.. అయితే ఈ సమస్యలు రావొచ్చు!

Image Source From unsplash