బరువు తగ్గేందుకు సోంపు ఎలా ఉపయోగపడుతుందంటే!

Photo Credit: Unsplash

By Chatakonda Krishna Prakash
May 30, 2023

Hindustan Times
Telugu

సోంపులో చాలా పోషకాలు ఉంటాయి. ఈ గింజలను తింటే సువాసనతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.

Photo: Pexels

శరీర బరువు తగ్గడానికి సోంపు తినడం ఉపయోగపడుతుంది. 

Photo: Pexels

సోంపులో యాంటియాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీంతో ఇవి తింటే శరీరంలోని చెడు కొవ్వు తగ్గి బరువు తగ్గేందుకు తోడ్పాటునందిస్తుంది. 

Photo: Pexels

సోంపు గింజలు.. అధికంగా ఫైబర్‌ను కలిగిఉంటాయి. దీంతో మీరు ఎక్కువగా ఆకలి కాకుండా చేస్తుంది. కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్‍ను ఎక్కువ సేపు ఉంచుతుంది. దీంతో మీరు వెంటవెంటనే ఆహారం తినకుండా ఉండొచ్చు. 

Photo: Pexels

సోంపు.. జీర్ణక్రియకు చాలా తోడ్పాటునందిస్తుంది. ఫ్యాట్‍ను బర్న్ చేసే ప్రక్రియకు ఇది సహకరిస్తుంది. దీంతో తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. 

Photo Credit: Unsplash

శరీరంలోని వివిధ హానికర ద్రవాలు బయటికి వెళ్లేందుకు సోంపు తినడం ఉపయోగపడుతుంది.

Photo Credit: Unsplash

ఈ ప్రయోజనాలను పొందేందుకు ప్రతీ రోజు మీ డైట్‍లో 2 నుంచి 3 గ్రాముల సోంపు గింజలను తీసుకోండి. బరువు తగ్గేందుకు సోంపు గింజలను టీలో, నీటిలో వేసుకొని తాగొచ్చు. 

Photo Credit: Unsplash

వేసవిలో ఐస్ క్రీమ్ తింటున్నారా..! ఈ విషయాలు తెలుసుకోండి 

image credit to unsplash